#


Index

గుణత్రయ విభాగ యోగము

దెబ్బతినవచ్చు. తాను దెబ్బ తిన్నా కష్టమే. తన బంధుమిత్రాదులు తిన్నా కష్టమే. ఆయే దుఃఖం వ్యయే దుఃఖమన్నట్టు అసలు ధనం పోగు చేసుకోటమూ కష్టమే. దాన్ని కాపాడుకోటమూ కష్టమే. ఎప్పుడది దివాలా తీస్తామోనని చింత. తీస్తే పెనుభయం. భయం భయంగా బ్రతుకుతుంటాడు ధనవంతుడు. పుత్రాదపి ధన భాజాం భీతిః అన్నారు స్వామివారు. హరతిని మేషః కాలస్సర్వం. ప్రాప్తం లేకపోతే ఎప్పుడెగిరి పోతుందో పోతుందన్నారు. కష్టపడి సుఖపడ్డా మంచిదేమో గాని సుఖపడి తరుచు కష్టపడటం కన్నా దారుణం లేదు. అసలు ఏమీ లేనివాడికి భయం లేదు గాని ఉన్నవాడి కెప్పుడూ భయమే. ఆందోళనే. ఇక ఏమి సుఖం. ఏమి అనుభవం. ప్రాపంచికమైన సుఖమే అంతా. తాత్కాలికమే అది నిత్యం కాదు.

  అలాగే రజోగుణ మెప్పుడూ మానవుణ్ణి పనులలో పడేస్తుంది. రజః కర్మణి అన్నాడు మహర్షి చలనాత్మకం కాబట్టి పనులు పెట్టుకోమనే చెబుతుంటుందది. దానితో ఎంత ధనవంతుడైనా దరిద్రుడైనా ఎంత శాస్త్రజ్ఞుడైనా ఎంత లౌకికుడైనా - ఎప్పుడూ ఏవో పనులు పెట్టుకొని అందులో మునిగి తేలుతుంటాడు. ప్రతి వాడూ ఒక కూలివాడే లోకంలో. మనస్సూరక ఉండదు. ప్రతిక్షణమూ ఆలోచిస్తుంటుంది. నోరు మూతపడదు. ఎప్పుడూ ఏదో ఒకటి మాటాడుతూనే ఉంటుంది. మరి కరచరణాదులా.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు