Operation. లక్షణం లోపల గుప్తంగా ఉంటుందే గాని బయట పడదు. అది చేసే పని ద్వారానే బయటపడి కనిపిస్తుందది. మనసులాంటిది లక్షణం మాట లాంటిది క్రియ అనుకోండి. ఎవడి మనసులో ఏ భావముందో సాధారణంగా తెలియదు మనకు. అదే వాడు నోరు దెరచి మాటాడితే అర్థమవుతుంది వాడి స్వభావమెలాంటిదో. అలాగే సత్త్వమనే దెప్పుడూ సుఖంలో బయటపడుతుంది. మనలో ఎంతోమంది వ్యాపారవేత్త లుంటారు. వ్యవహారవేత్త లుంటారు. నాయకులున్నారు. పాలకులున్నారు. వారందరూ ధనధాన్యాలతో వస్తు వాహనాలతో సుఖంగా బ్రతుకుతుంటారు. ఏది కోరితే అది అబ్బుతుంది వారికి. అన్ని సౌకర్యాలూ దగ్గర పెట్టుకొని హాయిగా ఉండగలరు. ఎందులోనూ ఏ కొరతా లేక జీవితం హాయిగానే సాగిపోతుంటుంది. ఇది సత్త్వ గుణ ప్రభావం. సత్త్వం వారిని సుఖే సంజయతి. సుఖాలలో ముంచి తేలుస్తుంటుంది. సందేహం లేదు.
కాని ఆదమరచి ఉండటానికి లేదు. అది కూడా బంధకమే వాడి పాలిటికి. అనుకూల శత్రువది. భోగ భాగ్యాలెన్ని ఉన్నా అవి అనుభవించే యోగ్యత ఉండాలి గదా. ఆధి వ్యాధులతో శరీరం దెబ్బ తింటే ఏమి చేస్తాడు. అవి రావని గారంటీ ఏమిటి. వాటికి కూడా లంచమిచ్చి రాకుండా చేసుకోలేడు గదా. అలాగే శరీరమే గాదు. మనసు కూడా