మరి ఈ తమో గుణమో. మూడింటిలోనూ నికృష్టమైనది. తమ స్త్వజ్ఞాన జం. ఇది సరాసరి అజ్ఞానం వల్లనే ఏర్పడుతుంది. ఆత్మజ్ఞానం లేకపోవటమే ఇక్కడ అజ్ఞానం. ఆత్మ విషయం గాక ఇక ఏ విషయంలో మానవుడు జ్ఞానం సంపాదించినా అది జ్ఞానా భాసే గాని అసలైన జ్ఞానం కాదు. ఇలాటి అజ్ఞాన మెప్పుడేర్పడిందో మోహనం సర్వదేహినాం. అది మోహనం. వీడూ వాడని లేదు. పండితులు మొదలు పామరుల దాకా ప్రతిదేహినీ పట్టి చూస్తుంది. వివేక బుద్ధిని అపహరిస్తుంది. ఏది మంచో ఏది చెడ్తో ఏది గమ్యమో జీవితానికి ఏది కాదో - ఏది పట్టుకొని ముందుకు పోవాలో - ఏది చివరకీ జీవిత సమస్యకు పరిష్కార మో ఏది కాదో - ఏ సంగతీ స్ఫురించకుండా చేస్తుంది - దానితో బుద్ధి మొద్దు బారిపోతుంది. సరియైన మార్గంలో పనిచేయదు. ప్రమాదాలస్య నిద్రాభిస్తన్ని బధ్నాతి. తన్మూలంగా ప్రమాదమూ ఆలస్యమూ నిద్రా ఇలాటి అవలక్షణాలు వచ్చి మనల నావరిస్తాయి. ప్రమాదమంటే అపాయమని గాదు. పరాకు. పరధ్యానం. అసలైన విషయమేదో దాన్ని గుర్తించక దానికి దూరమై పోవటం. Lack of Attention. ఆలస్యమంటే అలసత్వం. సోమరితనం. Lithargy Idleness. నిద్ర అంటే అందరికీ తెలిసిందే. కళ్లు మూతలు పడి ఒళ్లు తెలియకుండా పడిపోవటం.