ఉండలేవు. వారు నీ దగ్గర ఉన్నా దూరంగా ఉన్నా ఎప్పుడూ వారిని గూర్చే ఆలోచిస్తుంటావు. కనిపించినా కనిపించకున్నా వారి ముద్ర నీ మనస్సు మీద ఎప్పుడూ పడుతూనే ఉంటుంది. పడ్డ ముద్ర ఎప్పుడూ చెరిగి పోకుండా నిన్ను కలవర పెడుతూనే ఉంటుంది. మొత్తం మీద ఈ రాగద్వేషాలు రెండూ బాగా బలంగా ఒకటీ అంత బలంగా కాకున్నా కొంత బలంగా ఒకటీ - నీ మనసును పట్టి పీడిస్తూనే ఉంటాయి. ఇప్పుడివి రెండూ మనకా రజస్సనే గుణం వల్లనే ఏర్పడుతున్నాయి. రజస్సంటే అది చలనాత్మకమైన గుణం మానవుడి మనసులో కలిగే వృత్తులూ చలనాత్మకమే మనసే గదా మానవుడంటే. కనుక రజోగుణమనేది మానవుడికి ప్రధానమైన గుణం - తరువాత రాబోతుందీ విషయం.
కనుక రజోగుణం వల్ల మనస్సు చలిస్తూ చలిస్తూ అది రాగంగా మారుతుంది. ఈ రాగద్వేషాలే Likes of Dislikes. కర్మలన్నిటికీ మూలం. తన్నిబద్ధాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. కర్మ సంగం కల్పించి అది వీణ్ణి ఈ దేహం మేరకే కట్టి పడేస్తున్నది. కామోకాప్ష న్మన్యుర కార్షితని వేద మంత్రం. మానవుడు మనోవాక్కాయాలతో ఎప్పుడే కర్మ చేసినా దాని వెనకాల చేరి ప్రేరణ కలిగించేవి రాగద్వేషాలే. ఆ రాగద్వేషాలకు