#


Index

గుణత్రయ విభాగ యోగము

  తృష్ణా సంగ సముద్భవం - ఈ రాగరూపమైన రజస్సు వల్లనే తృష్ణ ఒకటీ ఆ సంగ మొకటీ రెండు దోషా లేర్పడుతున్నాయి. తృష్ణా అప్రాప్తాభిలాషః ఆ సంగః ప్రాప్తే విషయే మనసః ప్రీతి లక్షణః సంశ్లేషః - అని వ్రాశారు భాష్యకారులు. మనకింకా ప్రాప్తించని దాని విషయంలో ఏర్పడే అభిలాష లేదా కోరికకు తృష్ణా అని పేరు. పోతే ఆ విషయమే ప్రాప్తిస్తే దాని మీద వల్లమాలిన అభిమానమూ ఆసక్తీ ఏర్పడితే దానికా సంగమని Influence పేరు. కోరింది అనుభవానికి వస్తే రాగమవుతుంది. దానికెవరి వల్లనైనా విఘాత మేర్పడితే అదే ద్వేషంగా మారుతుంది. కామ ఏష క్రోధ అనే శ్లోకం దగ్గర ఇంతకు ముందు వివరించామీ విషయం. రాగద్వేషాలివే. ఇవే జీవితాంతమూ మన ప్రాణం తీస్తుంటాయి.

  ఇవే అమ్మ వారు చేతుల్లో ధరించిన పాశాంకుశాలు. పాశం రాగానికీ అంకుశం ద్వేషానికీ చిహ్నం. అసలా మాటకు వస్తే ద్వేషం కన్నా ప్రమాదకరమైనది రాగం. మనిషిని చంపదది. చంపినంత పని చేస్తుంది. నీకు నీ శత్రువు మీద ద్వేషముండవచ్చు. వాడి మొహం చూడకపోతే ఏ గొడవా లేదు నీకు. కాని రాగమలా కాదు. పెండ్లాం బిడ్డల మీదా ఇండ్లూ వాకిండ్ల మీదా గదా నీకు రాగం. వారిని చూడకుండా ఒక్క క్షణం కూడా

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు