#


Index

గుణత్రయ విభాగ యోగము

అందుకే చెప్పాముగా నదీ ప్రవాహం లాంటిదని. మనం దాన్ని అనులోమంగా ఉపయోగించుకొంటే నిర్మలమే ప్రకాశకమే సందేహం లేదు. సత్త్వాత్సం జాయతే జ్ఞానమని చెప్పబోతాడు కూడా. ఆత్మాభిముఖంగా ప్రసరిస్తే ఆత్మ జ్ఞానాన్నే ప్రసాదిస్తుందది మనకు. తన్నిమిత్తంగా ఆత్మానందాన్నే అనుగ్రహిస్తుంది. అలాకాక ప్రతిలోమంగా విషయాభిముఖంగా ప్రసరించిందో ఎంత నిర్మలమైనా అది కలుషితమైన జ్ఞానమే. ఎంత ఆనందమైనా అది దుఃఖ సమ్మిళితమైన తాత్కలికానందమే. అటూ ఇటూ రెండింటికీ అవకాశముంది అందులో. ఎటు వచ్చీ మనం దాన్ని సవ్యంగానా అపసవ్యంగానా ఎలా ఉపయోగించుకోవాలో మనమే నిర్ణయించుకోవలసి ఉంటుంది. ఇదీ ఇందులో ఉన్న ఆంతర్యం.

రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం
తన్నిబధ్నాతి కౌంతేయ - కర్మ సంగేన దేహినమ్ -7

  సత్త్వగుణ వృత్తాంతమయింది. అంతో ఇంతో మనకు మేలు చేసేదీ సత్త్వమే. రామాయణంలో విభీషణుడని గదా పేర్కొన్నాము దీన్ని. రాక్షస వంశ సంజాతుడైనా విభీషణుడెలా భీషణుడు కాడో అలాగే అంత భయంకరం కాదిది. అంత అని ఎందు కంటున్నామంటే దుర్వినియోగం చేస్తే భయంకరమే. దాని విలువ తెలిసి సద్వినియోగం చేసుకోగలిగితే

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు