#


Index

గుణత్రయ విభాగ యోగము

పాదనం మృషైవ సుఖే సంజనం. నైషా అవిద్యా. నహి విషయ ధర్మః విషయిణో భవతి. నేను సుఖంగా ఉన్నానని విషయ సుఖాన్ని విషయి అయిన నీమీద ఆరోపించుకొంటున్నావు. ఇది కేవలం నీ అవిద్యా దోషం. విషయ ధర్మమేది గానీ విషయి అయిన ఆత్మకు చెందదు. ఇలాటి అవిద్య వల్లనే అసక్తం సప్తమివ కరోతి - అసుఖినం సుఖిన మివ. ఆత్మ విషయ ప్రపంచంతో సంగం లేకున్నా సక్తుడయినట్టు అది తన సుఖం కాకున్నా తనదే అయినట్టు భావిస్తున్నది. అలాగే జ్ఞానమితి క్షేత్రస్యైవ విషయస్య అంతః కరణస్య ధర్మః న ఆత్మనః - జ్ఞానం కూడా విషయమైన అంతః కరణానికి చెందిన లక్షణమే. ఆత్మకు సంబంధించినది కాదు. ఏమో సుఖ జ్ఞానాలు రెండూ ఆత్మ వేనంటారా. అలాగయితే ఆత్మధర్మత్వే సంగానుప పత్తేః - బంధాను పపత్తేశ్చ అంటారాయన. సంగమనీ బంధమనే మాట రాగూడదట. సుఖ సంగేన జ్ఞాన సంగేన బధ్నాతి అని గదా గీతా వాక్యం. సుఖంతో సంగం జ్ఞానంతో సంగం కల్పించి సత్త్వగుణం మనలను కట్టిపడేస్తున్నదని గదా దాని అర్ధం. అసలైన బ్రహ్మజ్ఞానమూ తజ్జన్యమైన ఆనందమే అయితే సంగమూ బంధమూ ఎలా అయిందది. దీన్ని బట్టే చెప్పవచ్చు. అది సుఖా భాస జ్ఞానా భాసే గాని అసలైన ఆత్మజ్ఞానమూ ఆత్మ సుఖమూ కాదని.

  అలాంటప్పుడు సత్త్వం చాలా గొప్ప గుణమనీ నిర్మలమూ ప్రకాశకమూ అయినదని ఎలా మెచ్చుకొన్నారని అడుగుతున్నారేమో.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు