#


Index

గుణత్రయ విభాగ యోగము

యిందో బంధించి తీరుతుందది కూడా. సుఖ సంగేన బధ్నాతి - జ్ఞాన సంగేన చ. సుఖంలో కట్టి పడేస్తుంది. అలాగే జ్ఞానంలో కూడా పడేస్తుంది. అయితే కావచ్చు. సుఖంలో జ్ఞానంలో పడేస్తే మంచిదే గదా. జ్ఞానమూ సుఖమే గదా మానవుడు కోరవలసిం దెప్పటికైనా. కాదనలేదు. కాని ఆ సుఖం సుఖం కాదు. ఆ జ్ఞానం జ్ఞానం కాదు. సుఖాభాస. జ్ఞాన భాస. కారణమేమంటే అనాత్మ జ్ఞాన మా జ్ఞానం. అనాత్మ జన్యమైన సుఖమా సుఖం. ఆత్మజ్ఞానమూ ఆత్మ సుఖమూ కాదు.

  చెప్పాము గదా మనసనేది రెండు ప్రక్కలా పదునైన కత్తిలాంటి దని. ప్రాపంచికంగా ఆలోచించగలదు. పారమార్థికంగానూ ఆలోచించగలదు. అందుకూ ఇందుకూ కూడా ఉపయోగపడుతుంది మన జ్ఞానం. గోదావరీ ప్రవాహం లాంటిది మన జ్ఞాన ప్రవాహం. నదీజలాని కానకట్ట కట్టి పంట పొలాలకు మళ్లిస్తే బంగారమే పండుతుంది. అలాకాక దానిపాటికి దాన్ని వదిలేస్తే సరాసరి ఉప్పు నీటిలో కలిసిపోతుంది. అలాగే సత్త్వగుణ మెంత నిర్మలమైనా ప్రకాశకమైనా పరమార్ధాన్ని ప్రకాశింప చేయాలది. ప్రాపంచిక విషయాలను గాదు. విషయాభిముఖంగా వెళ్లిపోతే వీటివల్లా అంతో ఇంతో జ్ఞానం కలగకపోదు. సుఖమూ కలగకపోదు. కాని అది బ్రహ్మమూ కాదా జ్ఞానం. బ్రహ్మానందమూ కాదా సుఖం.

  కారణమేమంటే వర్ణించి చెబుతున్నారు వినండి భగవత్పాదులు. సుఖ సంగేన. సుఖీ అహ మితి విషయ భూతస్య సుఖస్య విషయిణి సంశ్లేషా

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు