స్వానుభవానికి తెచ్చుకోటానికీ. అంచేత సత్త్వగుణం గుణమైనా చాలా గొప్పది ఈ దృష్టితో చూస్తే. జ్ఞానమే గనుక అది నిర్మలత్వాత్ ప్రకాశక మనా మయం. నిర్మలమైనది జ్ఞానం. నిరాకారం గదా. కాబట్టి నిర్మలం చాలా స్వచ్ఛమైనది. మాలిన్య మనేదెప్పుడూ సాకారమైన పదార్ధానికే. నిరాకారమైన దానికే మాలిన్యమూ అంటదు. జ్ఞేయమైతే అది సాకారం. జ్ఞానం కనుక ఇది నిరాకారం. నిరాకారం గనుక నిర్మలం.
ప్రకాశక మనామయం. నిర్మలం గనుకనే ప్రకాశమది. దారి చూపుతుంది. ఇటు సంసారం వైపైనా దారి చూపుతుంది. లేదా అటు సాయుజ్యం వైపైనా చూపుతుంది. అది జ్ఞాన నిమిత్తమైన సత్త్వగుణానికే ఉందా స్వభావం. అలాటి స్వభావముండటం వల్లనే అనామయం. ఆ మయం లేనిది. ఆమయ మంటే వ్యాధి. ఆటంకం. ప్రతిబంధకం. నిరాకారమైన స్వచ్ఛమైన జ్ఞానానికి ప్రతిబంధకమే ముంది. ఒక స్పటిక మణిలాగా ప్రకాశకమూ నిరుప ద్రవమూ అని వ్రాస్తున్నారు భాష్యకారులు.
మరి ఇంత గొప్పదని పొగడుతున్నారు గదా సత్త్వగుణాన్ని. పైగా అది జ్ఞానానికి నిలయమంటున్నారు. ప్రకాశక మంటున్నారు. అనామయ మంటున్నారు. ఇక కావలసిందేమిటి సాధకుడికి. దాన్ని ఆశ్రయిస్తే సరిపోతుంది గదా అంటే వాస్తవమే ఆశ్రయించవచ్చు. మంచిదే. కాని అది కూడా ఒక గుణమే ననే మాట మరచిపోరాదు మనం. గుణమెప్పుడ