#


Index

గుణత్రయ విభాగ యోగము

  దీని కుపోద్బలకంగా వ్యాసమహర్షి మాటలోనే ఉన్న దొక మర్మం. దేహే దేహిన మవ్యయ మని. దేహి అయిన జీవుణ్ణి అవ్యయుడని వర్ణించాడాయన. అవ్యయ మంటే ఏమిటర్ధం. వ్యయం లేని వాడని గదా. వ్యయమంటే మార్పు. గుణాలుంటే గాని మారదు పదార్ధం. మారేది కాదు అది అవ్యయమని ఎప్పుడన్నాడో అప్పుడు దానికి గుణాలు లేవు. గుణాతీతమని చెప్పినట్టయింది. గుణాతీతమైనది ఒక పరమాత్మే. మరి దేహంలో ఉన్న జీవుణ్ణి కూడా ఇప్పుడు అవ్యయుడని పేర్కొన్నాడంటే వీడూ గుణాతీతుడైన పరమాత్మ స్వరూపుడేనని వేరే చెప్పాలా. నిజంగా పరమాత్మే సందేహం లేదు. అదే వివరిస్తున్నారు భాష్యకారులు. అవ్యయత్వం చోక్తం అనాదిత్వా దిత్యాది శ్లోకేన. జీవుడు శరీరంలో ఉన్నా పరమాత్మాయ మవ్యయః అవ్యయుడైన పరమాత్మే వీడని క్షేత్రజ్ఞాధ్యాయంలో శ్లోక ముదాహ స్తారాయన.

  అంతేగాక పరమాత్మ ఎప్పుడయ్యాడో పరమాత్మలాగా అవ్యయుడే గాక నకరోతి న లిప్యతే అని ఒక వాక్యముందక్కడ. అంటే అర్ధం. ఏపనీ చేయడు. దాని ఫలితం కూడా వాడి నంటదు. చేస్తే కర్త అవుతాడు. అంటితే భోక్త అవుతాడని అర్థం చెప్పామక్కడ. మరి కర్తా భోక్తే కదా జీవుడంటే. అవి రెండూ లేని వాడంటే వాడిక జీవుడెలా అవుతాడు. ఈశ్వరుడే. అనే చాటుతున్నదా శ్లోకం. అలాంటప్పుడు నిబధ్నంతి.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు