కట్టిపడేస్తుంటాయి నిత్యమూ. ఏమిటా గుణాలు. సత్త్వ మొకటి రజస్సొకటి. తమస్సొకటి. ఇవి మూడూ ప్రకృతి సంభవాః భగవన్మాయా సంభవాః ఈశ్వరీయమైన ఏ మాయా శక్తి ఉందో దాని మూలంగా కలుగుతున్నా యంటారు భాష్యకారులు.
ఉన్నాయా ఇవి అసలు. వస్తుతః లేనే లేవివి. ఉన్నట్టు భాసిస్తుంటాయి. అవిద్యాత్మక త్వాత్. జీవుడి అజ్ఞానం వల్ల ఇవేవో ఉన్నట్టు చేసినట్టు కనిపిస్తుంటాయి. అంత మాత్రమే. అసలే లేవన్నారు గదా. ఎలా కనిపించ గలిగాయి. తమాస్పదీ కృత్య ఆత్మానం ప్రతి లభంతే - ఆ ఈశ్వర తత్త్వాన్ని ఆధారం చేసుకొని లేని గుణాలే ఉన్నట్టు చెలామణి అవుతున్నాయి. సూర్యకిరణాల నాధారం చేసుకొని ఎండమావులు కనిపించటం లేదా. అలాగే ఇవీ. ఇవే దేహే దేహినం నిబధ్నంతి. ఈ దేహ మనే బంధిఖానాలో కట్టిపడేశాయి దేహిని.
నిజంగానే కట్టిపడేశాయా. కాదు. నిబధ్నం తీవ కట్టి వేసినట్టు అని వ్యాఖ్యానిస్తున్నారు స్వామివారు. నిజంగా కట్టేయలేదట. కట్టేసినట్టు భాసిస్తున్న దంటారాయన. అద్వైతు లేదీ వాస్తవంగా జరిగిందని ఒప్పుకోరు. అసలు సృష్టే వాస్తవం కాదు. జీవుడీ శరీరంలో ప్రవేశించటమూ వాస్తవం కాదని వారి వాదం. అలాంటప్పుడీ త్రిగుణాలేమిటి మనలనీ శరీరంలో తెచ్చి పడేయటమేమిటి. ఇక్కడే బంధించటమేమిటి. అయినా మనమీ