#


Index

గుణత్రయ విభాగ యోగము

స్వరూపం. ప్రాణంలో తెలివి లేదు. కదలిక ఉంది. అది జడం. అమ్మగారు. ఈ జ్ఞాన ప్రాణ శక్తి ద్వయ రూపంగా మీలో వచ్చి కూచోటం వల్లనే ప్రాణంతో జీవించ గలుగుతున్నావు. మనస్సుతో ఆలోచించ గలుగుతున్నావు. ఈ రెండు లక్షణాలుండటం మూలాన్నే నీవు గణపతి వయ్యావు. లేకుంటే నీవు కేవలం గణమే గణమంటే జగత్తు - గణపతి అంటే జీవుడు. జీవుడు మనః ప్రాణాల వల్లనే జీవుడయ్యాడు. అవి రెండూ కోలుపోతే వీడ చేతనమైన జగత్తే.

  మరి మేమిద్దరమూ వచ్చి మీ శరీరంలో ప్రవేశించామంటే ఎందుకో తెలుసా. ప్రయోజనం లేకుండా ఏ పనీ జరగదు. దీనికి ఉందొక మహత్తర ప్రయోజనం. అది ఏదో గాదు. మాలాగ నీవూ ముక్తుడవయి నిత్యానంద మనుభవించటమే. అది ఎలా సాధ్యమని అడుగుతావా. అది నీకు బోధించటానికే వచ్చాము. ప్రాణ రూపంగా కదలట మెందుకంటే జ్ఞానరూపమైన ఆలోచన చేయటానికి. అది ప్రాపంచికమైన విషయాలను గురించే అయితే సుఖం లేదు. పడిపోతావు మరలా ఈ గణంలో. గుణంలో అలా పడిపోయావంటే కర్తా భోక్తా అయిపోయి నీవు జీవాత్మ వవుతావు. దేహాత్మ వవుతావు. చివరకు మరీ బాహ్యంగా వెళ్లిపోయి భూతాత్మ వయి పోతావు. అదే సంసార బంధం నీకు.

  అలాకాక ప్రత్యగాత్మ వైపు చేయి ప్రయాణం. అంటే నీ అసలైన స్వరూపమేమిటో దాన్ని గురించే ఆలోచన చేయి. భర్గో దేవస్య ధీమహి.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు