నిరాకారమయి పోయారో అప్పుడు ప్రకృతి గుణాలు వారిని బంధించవు. అందుకే ఆ తల్లీ తండ్రీ ఇద్దరూ తప్పించుకొన్నారు. సంతానం మీద వచ్చి పడ్డాయా గుణాలు. ఎక్కడి నుంచి వచ్చాయవి. తల్లీదండ్రిలో లేనివి పిల్లలకెలా సంక్రమించాయి. వారిలో ఉంటేనే గదా ఆపోలికలే వారి సంతానాని కేర్పడుతాయి. నిజమే. ఉండి తీరాలి వారిలో కూడా గుణాలు. కాని చిత్రమేమంటే ఉన్నా అవి వారి అధీనంలో ఉంటాయి. అలా వశంలో ఉంచుకోటం వల్లనే వారీశ్వరులయ్యారు. వారినవి ఏమాత్రమూ బాధించవు. మీదు మిక్కిలి సృష్టి లయాది కార్యాలలో వారికవి సహాయపడతాయి.
మరి మన గతి ఏమంటే చెబుతున్నారు వారు మౌనభాషలో. మీరూ మాలాగే గుణత్రయాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. అందుకే మీకెన్నో జన్మ లవకాశమిచ్చి చూచాము. ఎవరో బ్రహ్మవేత్త లైన జ్ఞానులే ఆ అవకాశాన్ని పుచ్చుకొని మా స్థాయినందుకో గలుగుతున్నారు. మిగతా వారందరూ గుణాధీనులయి సంసారంలో పడి పోతున్నారు. మిమ్మల్ని మేము పేక్షించటం లేదు. వారిలో లాగే మీలో కూడా ప్రవేశించే ఉన్నాము. అమ్మా నాన్నా దూరంగా ఉన్నారని భావిస్తున్నారా. లేదు. మీలో ఎప్పుడూ తిష్ఠ వేసుకొనే కూచున్నాము. ఎవరా అమ్మా నాన్నా అని అడుగుతారా. మీరు గణపతులైతే ప్రతి గణపతి శరీరంలో ఉన్న ప్రాణమూ మనస్సే మేము. ప్రాణం తల్లి. మనస్సు తండ్రి. మనస్సులో తెలివి ఉన్నది. ఆ తెలివి అయ్యగారి