#


Index

గుణత్రయ విభాగ యోగము

చెప్పుకొంటే అయ్యగారు అమ్మగారు. వీరి దగ్గరికి వెళ్లేసరికి వారికి శరీరాలు లేవు గనుక నిమిత్తోపాదానాలు రెండూ ఏకమవుతాయి. అమ్మైనా అయ్యైనా ఒకే తత్త్వం. అర్థనారీశ్వరం. క్రింది భూమికకు దిగివచ్చే కొద్దీ శరీరాలు వచ్చి పడ్డాయి. కాబట్టి తల్లి వేరు తండ్రి వేరయి బీజా వాపం వల్ల ఆయా యోనులలో నుంచి మూర్తయ స్సంభవంతి. ఆకారా లేర్పడుతున్నాయి. దేహ సంస్థాన లక్షణాః మూర్ఛితాంగా వయవా : మూర్తః అని నిర్వచిస్తున్నారు భాష్యకారులు. కరచరణా ధ్యవయవాలన్నీ క్రమంగా పోగయి ఒక శరీరంగా Being in concrete form.

  ఇలా అశరీరులైన తల్లిదండ్రులతో ఆరంభమై సశరీరులైన తల్లిదండ్రుల వరకూ ఈ దేవ మనుష్యాది శరీరాలు వస్తున్నాయి. తద్వారా సంతానోత్పత్తి జరుగుతున్నది. వీటన్నిటికీ మూల కారణ మా మహాయోని. మహా బీజం. అహం మమ అని గదా నిర్దేశించాడు మహర్షి అహమంటే ఎవరు నీవు. అహం బీజ ప్రదః పితా. బీజాన్ని నిక్షేపించిన తండ్రినంటాడు. పోతే ఆ మహా యోని ఏదో గాదు దాన్ని భరించే నామాయా శక్తి. అదే తల్లి అంటాడు. వీరే విశ్వ ప్రపంచానికంతా జననీ జనకులు. కాళిదాసు లాంటి మహాకవులందరూ కీర్తించిన పార్వతీ పరమేశ్వరులు. అమ్మగారు. అయ్యగారు.

  అయితే ఇప్పుడు ప్రశ్నేమంటే సహజంగా గుణాతీతమైన తల్లిదండ్రులు గుణాలను సృష్టించారా. ఎంత అన్యాయం. ఎప్పుడు నిర్గుణం

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు