కేవలం నా ఉపాధులే గాని నా స్వరూపం కాదనే విమర్శ కోలుపోయి వీడి దృష్టి ననుసరించి పరమాత్మ వీణ్ణి ఈ శరీరమనే ఉపాధితోనే జత చేశాడట. అదే ఈ మానవుడిలా సృష్టి కావటమంటాడాయన. మానవుల కన్నా కనా కష్టమైనది మిగతా పశుపక్ష్యాదుల సృష్టి. వీడిదింకా రాజసమైన సృష్టి అయితే వాటి దలా కాక కేవలం తామసమైన సృష్టి. ఇలా జరిగిందని కాదు మరలా. ఎవరో జరిపారనీ గాదు. మన అవిద్యా దృష్టికే ఇది ఇలా జరిగినట్టు - ప్రకృతి పురుషులిద్దరూ కావాలని జరిపినట్టు - భాసిస్తున్నదని మరలా అద్వైతుల సమాధానం.
సర్వయోనిషు కౌంతేయ - మూర్తయ స్సం భవంతి యాః
తాసాం బ్రహ్మ మహ ద్యోనిః- అహం బీజ ప్రదః పితా -4
ముందు వ్రాసిన శ్లోక భావాన్నే ఇంకా కొంత దూరం వ్యాఖ్యానించి మనకు బోధిస్తున్నాడు వ్యాసభగవానుడు. సర్వయోనిషు మూర్తయ స్సంభవంతి యాః - తాసాం బ్రహ్మ మహద్యోనిః - ఉన్న రహస్యమంతా బయటపెడుతున్నాడు చాలా శాస్త్రీయంగా. సర్వ యోనిషు - ఆపెద్ద గర్భంలో నుంచి ఈ చిన్నవన్నీ వచ్చాయి. దేవ పితృ మనుష్య పశుమృగాది యోనులే ఆ సర్వ యోనులు. దేవ - దేవతలలో స్త్రీలు. పితృ - పితృ దేవతలలో స్త్రీలు. మనుష్య – మనుష్యజాతిలో స్త్రీలు. పశు మృగాది జాతులలో స్త్రీలు. స్త్రీ పురుష సాంగత్యం లేనిదే సృష్టి జరగదు. అలాగే చాలా పెద్ద స్థాయిలో