#


Index

గుణత్రయ విభాగ యోగము

శక్తి. జ్ఞానం పరమాత్మ. ప్రాణం ప్రకృతి. ఒకటి చిత్తు. మరొకటి సత్తు. చిత్తు నిమిత్తం. సత్తు ఉపాదానం. ఇది హిరణ్యగర్భుడనే సమష్టి జీవుడిలో నూటికి తొంభయి వంతు లభివ్యక్త Manifest మయింది. కనుకనే దేవతా జ్యేష్ఠుడనీ సృష్టి కర్త అనీ పేరాయనకు.

  కాగా అంతకంతకా జ్ఞాన క్రియా శక్తుల పరిమాణం తొంభయి నుంచి ఎనభైకి ఎనభై నుంచి డెబ్బైకి ఇలా స్థాయి పడిపోతూ వచ్చింది. ఈ తారతమ్యాన్ని బట్టి వారు దేవతలనీ వీరు మహర్షులనీ - వీరు మానవులనీ వారు దానవులనీ ఇంకా క్రింది స్థాయికి పడిపోయే కొద్దీ పశుపక్ష్యాదులనీ క్రిమీకీటకాదులనీ - చివరకు లతావృక్ష పాషాణాదులనీ విభాగ మేర్పడుతూ వచ్చిందీ సృష్టిలో. ఇందులో మానవులు మధ్యస్థులు. అటు దేవఋషి గణాలకున్న జ్ఞానమూ లేదు శక్తీ లేదు. ఇటు పశుపక్ష్యాదులలాగా మరీ జ్ఞాన క్రియాశక్తులు లేనివారూ కారు. వీరి కిటూ అటూ చూచి పురోగమించే వివేచన ఉంది. కనుకనే కర్మ జ్ఞానాలకు రెంటికీ అధికారి మానవుడే నని తీర్మానించింది శాస్త్రం. కావచ్చు. అయినా వీడిలా పడిపోవటాని కేమి కారణం. వీడి అపరాధమా. వీణ్ణి సృష్టించిన శివశక్తులదా అపరాధమని ప్రశ్న. దీనికి చాలా సూక్ష్మంగా సమాధానమిస్తారు భాష్యకారులు. ఏమని. అవిద్యా కామ కర్మోపాధి స్వరూపాను విధాయినం క్షేత్రజ్ఞం క్షేత్రేణ సంయోజయామి. అజ్ఞానమూ కామమూ కర్మా అనేవి

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు