#


Index

గుణత్రయ విభాగ యోగము

  రెండూ కాదని కొట్టివేసి భగవత్పాదులు దీన్నితాదాత్మ్య సంబంధమని పేర్కొంటారు. సంబంధం కాని సంబంధమిది. రెండూ వస్తువులైతే గదా సంబంధం. ఒకటి వస్తువు. మరొకటి దాని ఆభాస. ఇక సంబంధమేమిటి. కారణమే దాని కార్యంలో వచ్చి కూచున్నప్పుడిక సృష్టి ఏమిటి. ప్రపంచమంతా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. శక్తీ వ్యాపించే ఉన్నది. పురాణ భాషలో చెబితే తల్లిదండ్రులిద్దరూ గణపతిలో వచ్చి కూచొని ఉన్నా రెప్పటి నుంచో. ఇక గణమెలా సృష్టి కావాలి గణపతి ఎలా కావాలి. అంటే జీవజగత్తులని అర్థం. లోకంలో అయితే తల్లీ తండ్రీ వేరుగా ఉంటారు. పిల్లలు వేరుగా ఉంటారు. పిల్లలు వేరుగా కనపడుతుంటారు. వారిద్దరూ తమ సంతానంలో వచ్చి కూచోలేరు. ఇక్కడ అలా కాదు. సాక్షాత్తూ ఇద్దరూ ఒకటిగా వచ్చి జీవజగత్తులు రెండూ వ్యాపించి కూచున్నారు. ఇక సృష్టి ఎలా జరగాలో ఆలోచించండి.

  అలా కూచున్నట్టు దాఖలా ఏమిటని అడుగుతారా. ప్రతి ఒక్కటీ లోకంలో అస్తి భాతి అనే గదా చూస్తుంటాము. అస్తి అంటే ఉండటం. భాతి అంటే ఉన్నట్టు స్ఫురించటం. ఇందులో అస్తి ప్రకృతి అయితే భాతి పరమాత్మ. ఒకటి జడం మరొకటి చేతనం. జడ చేతనాత్మకమేగా సృష్టి అంతా. తులసీదాసు చెప్పినట్టు జడచేతన గుణదోషమయ బిస్వ కీన్హ కరతార్. అసలు జడమనేది కూడా లేదా మాటకు వస్తే. శక్తి శక్తి మంతుడికి

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు