#


Index

గుణత్రయ విభాగ యోగము

జీవులేర్పడరు. సంభవ స్సర్వభూతానాం తతో భవతి. అయితే కేవలం ప్రకృతి వల్లనే గాదు గదా జన్మ. తండ్రి ఉండాలి. ఎవరా తండ్రి. మమ అంటున్నాడు. అహం మమ. నేనూ నామాయాశక్తి. అహం తండ్రి. మమ తల్లి. తండ్రి నిమిత్త కారణం. తల్లి ఉపాదాన కారణం. లోకంలో కూడా చూడండి. గర్భం ధరించేది తల్లి. దానికి నిమిత్తం తండ్రి. తస్మిన్ గర్భం దధామ్యహ మని అందుకే అంటున్నాడు.

  ఆ తల్లి పెద్ద తల్లి మహత్. ఎంత పెద్ద తల్లి అంటే అశరీరమైనది. నిరాకారంగా వ్యాపించిన శక్తి గదా. కనుకనే మహత్తే కాక బ్రహ్మం కూడా. చరాచర పదార్ధాలన్నింటినీ తనలోనే ఇముడ్చుకొన్న మహాశక్తి అది. అలాటి సర్వవ్యాపకమైన మహాశక్తి అనే ఒకానొక దర్పణంలో ఆయన స్వరూపం ప్రతిఫలించింది. గర్భం దధామ్యహం. ఆ ప్రతిఫలించటమే గర్భాన్ని ఆధానం చేయటం. అద్దంలో ప్రతిబింబ మేర్పడింది. అద్దమే పట్టుకోగలదు ప్రతిబింబాన్ని. కాని బింబ మద్దంలోకి వాస్తవంగా రాలేదు. వచ్చినట్టు కనిపిస్తుంటుంది. అలాగే ఈ మహాశక్తి అనే బృహద్దర్పణంలో పరమాత్మ స్వరూపం నిజంగా ప్రవేశించిందా. ప్రవేశించిందంటే ప్రవేశించింది లేదంటే లేదు. ఇది అద్వైతం. ప్రవేశించిందనే చెబుతారు ద్వైతులంతా. లేకుంటే ఈ సృష్టి జరగదంటారు. అసలు సృష్టి జరిగితే గదా అంటాడద్వైతి. అద్దం చూస్తున్నావు నీవిప్పుడు. అక్కడ సృష్టి అయిందా

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు