పోయినట్టు భాసిస్తున్నదంటే చెప్పాము గదా అది కేవలమాత్మ తాలూకు ఆభాసేనని. అది కూడా దాని మాయా విలాసమేనని.
మమ యోని ర్మహ ద్య్రృహ్మ - తస్మిన్ గర్భం దధామ్యహం
సంభవ స్సర్వ భూతానాం తతో భవతి భారత - 3
అయితే ఆభాసగా నైనా ఈ సృష్టి ఎలా జరుగుతున్నది. దీనికి నిమిత్తమేమిటని సందేహ మొకటి మనలను పట్టి పీడిస్తూనే ఉంటుంది. ఏది జన్మించిందని చెప్పినా అది యధార్థమైనా ఆభాస అయినా దానికి కారణమంటూ ఒకటుండి తీరాలి. అదీ ఒకటి గాదా కారణం. చేతనమైన నిమిత్త కారణమూ ఉండాలి. అచేతనమైన ఉపాదాన కారణమూ ఉండి తీరాలి. ప్రస్తుత మీ సృష్టి మీరెలా జరిగిందని పేర్కొన్నా అవి రెండూ ఏమిటో నిర్దేశించ గలరా అని మరలా ఒక ప్రశ్న. దానికిప్పు డిస్తున్నాడు సమాధానం భగవానుడు. ఇది చాలా నిగూఢార్ధమైన శ్లోకం. Highly Scientific. ఎంతో శాస్త్రీయమైనది. మనమా స్థాయి కెదిగి చూస్తే గాని బోధ పడదు. మొట్టమొదటనే ఒక పని జరిగింది. ఇద్దరు పెద్ద మనుషులున్నారు. ఒకరు పరమాత్మ మరొకటి మాయా శక్తి. నామాయా శక్తే సమస్త భూతాలూ ఏర్పడటానికి కారణ మంటున్నా డాయన. మమ యోనిర్మహత్ బ్రహ్మ. యోని అంటే ఉపాదాన కారణం. కుండకు మట్టి ఉపాదానం. అది లేకపోతే కుండ ఏర్పడదు. అలాగే ప్రకృతి లేకపోతే