#


Index

గుణత్రయ విభాగ యోగము

పారేస్తుం దుపనిషత్తు. కాబట్టి విద్య అంటే బ్రహ్మ విద్య ఒక్కటే. అదే పరవిద్య. అది జీవితాంతమూ శ్రవణ మనన ధ్యానాదులు చేస్తూ పోతే పరాంసిద్ధి మితో గతాః - దేహపాతమైన మరుక్షణం మోక్షమనే ఫలం చవిచూడగలడు మానవుడు.

ఇదం జ్ఞానముపాశ్రిత్య- మమ సాధర్మ్య మాగతాః
సర్గేపి నోపజాయంతే - ప్రలయే న వ్యధంతి చ - 2

  అంతే కాదు. అది మనకు ప్రసాదించే మోక్షఫలం కూడా అవశ్యంగా కలిగి తీరుతుంది. కలిగిన ఆ ఫలం కూడా ఎప్పటికీ తొలగిపోయేది కాదు. శాశ్వతంగా మనకు దక్కే ఫలితమది. అదే వర్ణిస్తున్నాడిప్పుడు. ఇదం జ్ఞానముపాశ్రిత్య ఈ బ్రహ్మజ్ఞానమనేది ఒక్కటి సాధించావంటే చాలు. ప్రారబ్ధం తీరి శరీరం పతనమైతే మమ సాఢర్మ్యమాగతాః తప్పకనా సాధర్మ్యం పొందుతారని హామీ ఇస్తున్నాడు భగవానుడు. సాధర్మ్యమేమిటి. సమానధర్మత్వమా. కాదు. అది విశిష్టాద్వైతులు చెప్పే ముక్తి. ఇది అలాటి ముక్తి కాదు. అద్వైతులు చెప్పే ముక్తి ఇది. కనుకనే మమ సాధర్మ్యమంటే మత్స్వరూపతా మని అర్థం వ్రాశారు స్వామివాడు. ధర్మికీ Substance దాని ధర్మానికీ Property భేదం లేదు అద్వైతంలో. ధర్మమనేది ఆ పదార్ధ స్వరూపమే. తేడా లేదు. పరమాత్మ సామాన్య స్వరూపమైతే Universal జీవ జగదీశ్వరులనే మూడు భావాలూ విశేషాలు Particular. విశేషాలే

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు