#


Index

గుణత్రయ విభాగ యోగము

చెందిన జ్ఞానం కూడా సామాన్యమూ సర్వ వ్యాపకమూ. కనుక తాని న మోక్షాయ. అవి మనలను బంధం నుంచి తప్పించలేవు. ఇదంతు మోక్షాయ. ఇది ఒక్కటే మోక్షానికి పనికివచ్చే జ్ఞానం. ఇతి పరోత్తమ శబ్దాభ్యాం సౌతి శ్రోతృ బుద్ధి రుచ్యుత్పాదనార్ధం. పరమని ఉత్తమమని ప్రశంసిస్తున్నాడు. గీతాచార్యుడు శ్రోతల బుద్ధులను మిగతా వాటి నుంచి దానిమీదికి మరల్చటాని కని వ్రాస్తారు భాష్యకారులు.

  యద్ జ్ఞాత్వా మునయ స్సర్వే పరాంసిద్ధి మితో గతాః - అంతేకాదు. ఉత్తమమైన జ్ఞానమైనందుకు నిదర్శనమేమంటే ఇలాటి జ్ఞానం ఒంటబడితే చాలు. అది ఎలా పరమమైనదో అలాటి పరమమైన సిద్ధినే పొందగలడు మానవుడు. కారణాన్ని బట్టి కార్యం. కారణం గొప్పదైతే దానికి ఫలం కూడా గొప్పదే అయి తీరుతుంది. కారణమిక్కడ ఆత్మజ్ఞానం గదా. కనుక దాని కనురూపమైన మోక్షఫలమే సిద్ధిస్తుంది. పరాంసిద్ధి మనటం వల్ల లోకంలో సిద్ధులనేవి అనేక మున్నాయని అవి తాత్కాలికమైనవే గాని శాశ్వతమైన ఫలితాన్ని మనకందివ్వ లేవని అర్థమవుతున్నది. సా విద్యాయా విముక్తయే అన్నారు పెద్దలు. జీవిత సమస్యను పరిష్కరించి ఎప్పటికైనా విముక్తిని కల్పించే జ్ఞానమే జ్ఞానం గాని పరిష్కరించక పోగా సమస్యనింకా జటిలం చేసే ఇతర జ్ఞానాలేవి పట్టుకొని వేళ్లాడినా ఏమి ప్రయోజనం. కుక్కతోక పట్టుకొని గోదావ రీదినట్టే. అవిద్యతే అవి విద్యలే కాదని త్రోసి

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు