14. గుణత్రయ విభాగ యోగము
పదమూడో అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం సమాప్తమయింది. పోతే పద్నాలుగోదైన గుణత్రయా ధ్యాయంలో ప్రవేశిస్తున్నాము. మరి దానికీ దీనికీ సంబంధమేమిటని ప్రశ్న. అదేమిటో భగవత్పాదులే సెలవిస్తున్నారు తమ అవతారికలో. సర్వ ముత్పద్యమానం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగా దుత్పద్యతే ఇత్యుక్తం. ప్రతి ఒక్కటీ ప్రపంచంలో జన్మిస్తున్నదంటే క్షేత్రమూ క్షేత్రజ్ఞుడూ ఈ రెండింటి సంపర్కం వల్లనే జన్మిస్తున్నది. తత్కథమితి తత్ప్రదర్శనార్ధం పరం భూయః ఇత్యాది రధ్యాయ ఆరభ్యతే. అది ఎలాగో దాన్ని నిరూపించటానికి పరం భూయః అని ఈ అధ్యాయ మారంభమవుతున్నది. అంతేకాదు. ఈశ్వర పరతంత్రయోః క్షేత్ర క్షేత్రజ్ఞయోః జగత్కారణత్వం నతు సాంఖ్యానామివ స్వతంత్రయో రిత్యేవ మర్ధం. ఒక ఈశ్వరుడి మీద ఆధారపడి క్షేత్ర క్షేత్రజ్ఞులీ జగత్తుకు కారణభూతు