#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

  అయితే ఇది సిద్ధాంతమేనా దృష్టాంతమయ్యే అవకాశముందా. పొరబాటు పడుతున్నావు. ఏదైనా మొదట దృష్టమైతేనే దాని ఆధారంతో ఒక సిద్ధాంతం బయలుదేరుతుంది. ఎవరికి దృష్టమయిందని అడగకు. ఎవరికో ఒకరికి. నీకు కాలేదు గదా అని ఎవరికీ నీవు శాపం పెట్టలేవు. ఏ రంగంలోనైనా అయ్యే వాడి కనుభవ మవుతూనే ఉంటుంది. కాని వాడికెప్పుడూ కాదు. కాని వాళ్లు 90 మంది అయితే అయినట్టు కనిపించేవాళ్లు 9 మందైతే కచ్చితంగా అయిందని పించుకొన్న వాడెవడో ఒక్కడుంటాడు. కశ్చిన్మాం వేత్తి తత్త్వతః. అని గీత అన్నదంటే ఈ దృష్టితోనే అన్నది. అందుకే ఇక్కడా అధ్యాయాంతంలో అదే మాట సెలవిస్తూన్నాడు మహర్షి నిర్మొహమాటంగా. ఏమని. యే విదుర్యాంతి తే పరం. ఎవరైతే అని కండిషను పెట్టాడాయన. ఎవరైతే ఈ అద్వైతాత్మ స్వరూపాన్ని ఉన్నదున్నట్టు చూస్తారో వారే మోక్షసామ్రాజ్యాని కర్హులట. విదుః అంటే కేవలం తెలుసుకోటమని కూడా కాదు. ముఖా ముఖీగా దర్శించటమని. ఆత్మావా అరే ద్రష్టవ్యః అన్నాడు యాజ్ఞవల్క్యుడు. గుర్తు చేసుకోండి. కశ్చిన్మాం వేత్తి అనేచోట కూడా విదిధాతు రూపమే ప్రయోగించాడు మహర్షి విద్ అంటే చూడటమని అసలైన ధాత్వర్ధం. అదే సంస్కృతానికి సోదర భాష అయిన లాటినులో Video అయిందని కూడా ఇంతకు పూర్వం చెప్పి

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు