#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

ప్రకాశయతి. భాసింపజేస్తున్నది. అంటే ఫలానా అని మనకు స్ఫురింప చేస్తున్నది. చేస్తున్నదంటే అది ఒకే చోట కూచుంటే ఎలా. వ్యాపించి తీరాలి. వ్యాపించటమంటే బాహ్య ప్రపంచాన్నే గాదు. ఆభ్యంతరమైన శరీరాది సంఘాతాన్ని కూడా. జ్ఞానస్వరూపంగా అది స్థావరమైతే జ్ఞేయరూపంగా అది జంగమం. అంటే స్వరూపతః అచలం. నామరూపాది విభూతితః చలం. మొదటిది జ్ఞానం. రెండవది కర్మ. భగవద్గీతలో వ్యాసభగవానుడి సందేశమంతా ఇదే. ఈ జ్ఞాన కర్మ ద్వయమే. ప్రసరించకుంటే జ్ఞానం. ప్రసరిస్తే కర్మ. రెండూ మరలా వేరు గావు. ఒకే ఒక తత్త్వం. స్వరూపమైనా అదే. విభూతి అయినా అదే. వస్తువే ఆభాస. ఆభాసే వస్తువు. తేడా లేదు. తేడా లేకపోవటమే అద్వైతం. దాన్ని బాగా మనసుకు పట్టించటానికే ఈ దృష్టాంత ద్వయం తీసుకొన్నాడు గీతాచార్యుడు. చెప్పాము గదా సచ్చిత్తులనే రెండు లక్షణాలకూ రెండుపమానాలని.

క్షేత్ర క్షేత్రజ్ఞయో రేవ మంతరం జ్ఞాన చక్షుషా
భూత ప్రకృతి మోక్షం చ యే విదుర్యాంతి తే పరమ్ - 34

  రెండింటికీ రెండన్నాము గదా అని నిజంగానే రెండు వేర్వేరు భావాలను కోకండి మరలా. సచ్చిత్తులు రెండూ అవినాభావమని చెప్పాము. సత్తును విడిచి చిత్తు లేదు. చిత్తును విడిచి సత్తు లేదు. అర్థనారీశ్వర మది.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు