ప్రకాశం. అందుకే సచ్చిత్తులు రెండూ అవినాభావంగా ఉంటాయాత్మలో. అంటే ప్రమాణ ప్రమేయాలు రెండూ అదే. తన సత్తాను తానే గమనిస్తుంటుం దని అర్థం.
ఇందులో సల్లక్షణాని కాకాశ దృష్టాంత మిచ్చి చిల్లక్షణాని కిప్పుడు రవి మండల దృష్టాంత మిస్తున్నాడు మహర్షి. యధా ప్రకాశ య త్యేకః కృత్స్నం లోక మిమంరవిః ప్రస్తుత మీ సూర్యమండల మాకాశంలో కనిపిస్తున్నదంటే అది ఎక్కడ ఉంది. ఎలా ఉంది. ఏకః - అది ఒక్కటే ఉందా మండలం. అయినా సమస్తమైన ప్రపంచాన్నీ ప్రకాశింప చేస్తున్నది. తాను ప్రకాశించ కుండా పోవటం లేదు. తాను స్వయంగా ప్రకాశిస్తూనే మిగతా ప్రపంచాన్ని కూడా భాసింప జేస్తున్నది. ఒకచోట ఉంటే అది మండలం. సర్వత్రా ప్రసరిస్తే అది ప్రకాశం. ఈ ప్రకాశమేదో గాదు మరలా. దాని ప్రకాశమే. అదే. అది అదిగానూ ఉంటుంది. అలా ఉంటూనే సర్వత్ర కనిపిస్తూంటుంది. ఒకటి దాని స్వరూపం. మరొకటి దాని విభూతి.
అలాగే క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి. ఈ క్షేత్రజ్ఞుడనే ఆత్మ చైతన్యం కూడా ఒక్కటే. ఎన్నో లేవు చైతన్యాలు. అనేసరికి జీవుడెగిరి పోయాడిప్పుడీ మాటతో. ఒకే ఒక చైతన్యం ఈ క్షేత్రమనే సకల ప్రపంచాన్నీ