సోకదు. అందులోనే వర్షం కురుస్తున్నది. అయినా ఆ వర్షధారల కది తడిసిపోవటం లేదు. అందులోనే భూమ్యాదులైన గోళాలెన్నో తిరుగుతున్నాయి. అయినా దాని మాలిన్యం సోకటం లేదు దానికి. అది ఎలా నిర్లిప్తమది. ఉండాలో అలా నిరంజనం గానే ఉంటున్నది. నోపలిప్యతే.
ఇదే మన ఆత్మ చైతన్యానికి మంచి దృష్టాంతం. ఆత్మ కూడా ఆకాశంలాగా సర్వత్రా వస్థితః - సర్వ ప్రపంచాన్నీ వ్యాపించి ఉంది. ఎలాగా అని అడుగుతావేమో. సద్రూపంగా వ్యాపించిందా లేదా. అలా వ్యాపించక పోతే ప్రతి పదార్ధమూ ఉంది ఉంది అని ఎలా అనగలవు. అన్నావంటే అది సర్వత్ర ఉందనేగా అర్థం. అది అలా ఉండటం సత్తైతే ఉందని స్ఫురించటం చిత్తు. ఈ భాగ్యమింకా జడమైన ఆకాశానికి లేదు. చైతన్యం లేకున్నా అది సర్వత్ర ఉండగలిగితే చైతన్యంతో కూడిన ఈ ఆకాశని కేమి కర్మ సర్వత్ర లేకపోవటానికి. మరి సర్వత్రా ఎప్పుడుందని నిర్ధారణ అయిందో అలాంటప్పుడది ఈ దేహంలో ఉండటాని కేమి ఇబ్బంది. సర్వత్ర ఉన్న ఆకాశం ఘటంలో లేకుండా పోతుందా. అలాగే సర్వగతమైన ఆత్మ మన ఈ మూడు మూరలా జానెడు దేహాన్ని వ్యాపించ లేదా. సిగ్గు చేటు.