#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

చేస్తూనే ఉంటా. అయినా స్వరూప జ్ఞానంతో చూస్తాను గాబట్టి చేయటం కాదది. ద్విపాత్రాభినయ మది. ఎవడికి వాడి కనుభవానికి వచ్చే విషయం. అంచేత నకరోతి నలిప్యతే అనే గీతా వాక్యం కరెక్టే. ఆ భాసగా చేస్తుంటాడు. స్వరూపంగా చేయటం లేదు.

యధా సర్వగతం సౌక్ష్మ్యా- దాకాశం నోపలిప్యతే
సర్వత్రా వ స్థితో దేహే - తధాత్మా నో పలిప్యతే - 32

  ఈ అద్వైత భావాన్నే దృష్టాంత బలంతో ఇంకా అద్భుతంగా వివరిస్తున్నాడు మహర్షి. యధా సర్వగతం సౌక్ష్మ్యాదాకాశం. ఇప్పుడొక ఆకాశాన్నే తీసుకొని చూడు. ఎక్కడ ఉందది. సర్వగతం. సర్వత్రా వ్యాపించి ఉంది. అలా వ్యాపించాలంటే ఎలాంటి దయి ఉండాలది. సౌక్ష్యాత్. అతి సూక్ష్మమై ఉండాలి. అతి సూక్ష్మమే దవుతుంది. ఏది నిరాకారమో అది. నిరాకారం గనుకనే సర్వ వ్యాపకమది. అలాగే గదా చూస్తున్నా మాకాశాన్ని మనమిప్పుడు. ఎప్పుడిలా నిరాకారంగా వ్యాపించి కనిపిస్తున్నదో దానికిప్పు డేదైనా మాలిన్య మంటుతున్నదా. అందులోనే వాయువు సంచరిస్తున్నది. అయినా దానితో పాటది చలించటం లేదు. చలనం దాని నంటదు. అలాగే తేజస్సు ప్రయాణం చేస్తున్నది. అయినా ఆ తేజోరూపం దానికి

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు