#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

ఆశ్చర్యపడవచ్చు నీవు. ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే నీవు చేస్తున్నానని అనుకొంటున్నది నీవు గాదు. నిరాకారమైన జ్ఞానమెలా చేయగల దేపనైనా, మరి ఎవరు చేయటం. నీ జ్ఞానాని కుపాధులైన మనోవాక్కాయాలు. మరి ఫలిత మెవరను భవించటం. ఆ మనస్సే. అదెక్కడి దంటావేమో. నీ ఉపాధే నీ విశేషమే అది. నీవే సామాన్యమైతే అవి నీ విశేషాలు. సామాన్యం సామాన్యంగా కదలదు మెదలదు. విశేషరూపంగా కదులుతుంది చేస్తుంది అనుభవిస్తుంది. జలం జలంగా నిశ్చలం. తరంగ బుద్బుదాదులుగా చలం.

  జల బుద్బుదాలకు చైతన్యం లేదు. అచేతనాలవి. అంచేత ఈ బుద్బుదం నాదే నా విభూతేనని జలమనుకోలేదు. కాని శరీరం లోనే ఉన్న ఈ జీవ చైతన్యమనుకో గలదు నేనా ఈశ్వర చైతన్య మేనని. ఈ శరీరాది సంఘాతమంతా దాని విభూతేనని. ఎప్పుడైతే స్వరూప దృష్టి ఆభాస దృష్టీ రెండూ ఉన్నాయో - శరీరేంద్రియాదులూ వాటి చేష్టలూ ఏవో గావప్పుడు. ఆ భాసగా నేనే ఈ క్రియలన్నీ చేస్తూ స్వరూపంగా ఏదీ చేయకుండా వాటిని గమనిస్తున్నట్టు అనుసంధానం చేసుకోగలను. అలా చేసుకొంటూ పోతే కరోతి నకరోతి. చేస్తుంటాను. చేయను. లిప్యతే నలిప్యతే. ఫలిత మంటుతుంది. అంటదు. రెండూ సమన్వయ మవుతాయి నాకు.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు