#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

ప్రశ్నేముంది. అనాదే కావాలి నీ జ్ఞానం. అంటే నీ జ్ఞానానికి జన్మ లేదు. పోతే అనాదేగాక నిర్గుణం కూడా అది. ఎలాగ. జ్ఞానం గదా నీ స్వరూపం. దానికి దేశకాలాది గుణాలెలా వర్తిస్తాయి. వాటిని కూడా సాక్షిగా చూస్తున్నావు నీజ్ఞానంతో. అలాంటి జ్ఞానానికి గుణాలేమిటి. నిర్గుణమే కావాలి. నిర్గుణమే గుణాత్మకమైన శరీర మనఃప్రాణాదులతో సంబంధం పెట్టుకొన్నదంటే అది వాస్తవమా. కాదు. ఆ భాస. ఇలా తాను వస్తురూపమై తన ఆభాసతో వ్యవహరిస్తుండటమే జీవితం. స్థితి.

  అలాగే నిరాకార నిర్గుణం కనుక ఎలాటి మార్పు లేదు దీనికి. మారినట్టు నీ జ్ఞానం నీకు కనపడు తున్నదంటే అది వృత్తి రూపంగా వాసనా రూపంగా భాసించటమే. దాని వృత్తులు అది ఎలా అవుతుంది. దాని వాసనలది ఎలా అవుతుంది. జ్ఞానంలో నుంచి ఎప్పటికప్పుడు దయిస్తుంటాయి అస్తమిస్తుంటాయి వృత్తులు Ideas. అవి వస్తున్నా పోతున్నా జ్ఞానముంది నీకు. లేకుంటే వాటిని గమనించ లేవు. అలాగే వాటి వాసనలు. అవి ఆ వృత్తి ప్రవాహం వల్ల ఏర్పడ్డ వండు మట్టి. ఇంతెందుకు. ఇంగువ బట్టిలో చుట్టి పెడతాము. అంతా వాడుకొంటాము. బట్ట ఖాళీ అవుతుంది. అప్పటికీ ఇంగువ వాసన వస్తుంటుందా బట్ట. అంతమాత్రాన బట్ట ఇంగువగా మారుతుందా. ఇంగువే అవుతుందా. అలాగే అవ్యయ మీ

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు