#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

జన్మించింది. ఖాళీ అనే భావమెలా ఏర్పడింది. అంతకు ముందు ఖాళీని కూడా గమనించే జ్ఞానముంటేనే గదా. అలాగే ఆకాశం సగుణం. శబ్దమనే గుణముంది దానికి. గుణముంటే అది మారే బాపతే. ఆత్మ అలా సగుణం కాదు. నిర్గుణం. గుణాలకు విలక్షణంగా ఉండి గుణాలను గమనిస్తున్నది. కనుక నిర్గుణం. అవ్యయం. అదే ఇప్పుడు నీ శరీరంలో ఉన్నది. మరేదో గాదు. మరి అలాగైతే నా అనుభవంలో ఉండాలి గదా. ఎందుకలాటి అనుభవం నాకు కలగటం లేదు. కలుగుతూనే ఉంది. అయినా ఎలా కలగటం లేదని తెలివి తక్కువగా అడుగుతున్నావు నన్ను. ఎలాగో చెప్పండి. చెబుతున్నాను విను.

  నీవంటే నీ జ్ఞానమేనా కాదా. నీవు లేకుండా జ్ఞానం లేదు. జ్ఞానం లేకుండా నీవు లేవు. అది నీ స్వరూపమే. ఎక్కడ ఉందది. నీ దగ్గరే ఉంది. నీవే అది. అది ఎప్పటి నుంచి ఉంది నీ దగ్గర. ఆది ఉందా దానికి. నాకాది ఉందా అని అడుగుతున్నదెవరు. నీవే గదా. నీవుండి అడుగుతున్నావా లేకుండానే అడుగుతున్నావా. ఉండే గదా అడుగుతావే ప్రశ్న అయినా. నీలోనుంచే గదా రావాలది. అలాంటప్పుడు నేనెప్పటి నుంచి ఉన్నాను నాకాది ఏది అనే ప్రశ్న జ్ఞానంలో నుంచే వస్తున్నది. అప్పటికా ప్రశ్నకు ముందే నీవుండాలి. ముందే ఉంటే ఇక ఆది అనే

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు