#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

అంటున్నావే. ఆ బందీ అయిన ఆత్మ ఎవరను కొంటున్నావు. అది పరమాత్మా అయమవ్యయః ఆ బందీ అయినట్టు కనిపిస్తున్నది నీవనుకొంటున్న జీవాత్మ గాదు. సాక్షాత్తూ పరమాత్మే. పరమాత్మే వచ్చి కూచున్నాడీ శరీరంలో. సర్వత్ర ఉన్నప్పుడాయన శరీరంలో మాత్రముండదా. ఉండకపోతే సర్వవ్యాపకమెలా అవుతాడు. కాబట్టి సర్వత్ర ఉంటూ శరీరంలో కూడా ఉంటున్నాడు. ఉంటే శరీరం మేరకు పరిమిత మయ్యాడేమో అని మళ్లీ నీవు సందేహిస్తావేమో. అవ్యయః - శరీరంలో అనేసరికి అది మారి ఒక తునక అయి ఇక్కడికి వచ్చిందని గాదర్ధం. నిరాకారమైన చైతన్యమెలా మారుతుంది కాకపోయినా. కాబట్టి వచ్చింది చేసిందంటే వ్యయమయి గాదు. అవ్యయంగానే ఉంది శరీరంలో. శరీరం బయట ఎలా ఉందో అలాగే శరీరం లోపలా కూడా ఒకే రూపంలో ఉంది. ఇప్పుడొక ఆకాశముందంటే అది ఒక కుండ వెలపల ఎలా ఉందో కుండ లోపల కూడా అలాగే ఉందా లేదా. కుండలో కొంచెంగా కనిపించిన మాత్రాన అది తునిగిపోయి కుండ మేరకు తగ్గి పోయిందనా. కాదు గదా. అలాగే ఈ చిదాకాశం కూడా తగ్గదు హెచ్చదు.

  అంతేకాక జడాకాశం లాంటిది కూడా కాదిది. అనాది త్వాన్నిర్గుణత్వాత్. జడమైన ఆకాశం అనాది కాదు. అది కూడా ఆత్మనుంచి

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు