#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

అనాత్మలో ఆత్మనూ చూడాలి ఎటు వచ్చీ. చూస్తే అందులో నిలిచేది ఆత్మే. అనాత్మ కాదు. ఎలాగంటే తరంగం జలంలో జలం తరంగంలో చూచామనుకో. ఏది పోతుంది. ఏది మిగులుతుంది. తరంగం పోతుంది. జలమే మిగులుతుంది. ఏమి కారణం. జలం జలంగానూ ఉంది. తరంగం గానూ ఉంది. ఇక తరంగ మెక్కడిది. అయినా కనిపిస్తున్నది గదా అని ప్రశ్న. అది జలమే అలా తరంగ రూపంగా కనిపిస్తున్నదని జవాబు. అప్పుడు తరంగం కనిపించినా భయం లేదు. అది జలమేనని ఆరూఢమయింది. అలాగే అనాత్మలో ఆత్మ ఆత్మలో అనాత్మ అన్నప్పుడనాత్మ ప్రపంచమిలా నిత్యమూ కనిపిస్తున్నా మనం బెదిరి పోనక్కర లేదు. అదేదో గాదు నా ఆత్మే ఇలా వివిధ రూపాలు ధరించి కనిపిస్తున్న దంతకన్నా ఇక్కడ ఏమీ లేదనే బరవసా ఏర్పడుతుంది. ఈ రెండు శ్లోకాలూ అసలు ఈశావా స్యోపనిషత్తు శ్లోకాన్ని చూచి మహర్షి కల్పించినవే. యన్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవాను పశ్యతి - సర్వభూతేషు చాత్మానం - తతో నవి జుగుప్సతే - అనే మంత్ర వర్ణానికివి రెండూ అనుకరణలు. శ్రుతి చెప్పిన మాటే గీతా స్మృతి కూడా చెబుతున్నది. మొత్తం మీద సర్వాత్మ భావమే ఏది చెప్పినా మనకు చెబుతున్నదీ చెబితే మనం గ్రహించవలసినదీ.

అనాదిత్వా నిర్గుణత్వా- త్పరమాత్మాయ మవ్యయః
శరీరస్థపి కౌంతేయ - న కరోతి న లిప్యతే - 31

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు