#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

  ఎందుకంటే ఇందులో ఒక సూక్ష్మమున్నది. అనాత్మ ప్రపంచాన్ని మాత్రమే చూస్తూ ఆత్మను మరచి పోతే అది విక్షేపానికి దారితీస్తుంది. అనాత్మను మరచి కేవలమాత్మనే ధ్యానిస్తూ కూచుంటే అది ఆవరణకు దారి తీస్తుంది. రెండూ తప్పే. అది పరమాత్మకు దూరం చేసి మనలను ప్రకృతి గుణాలలో పారేస్తుంది. ఇది ప్రపంచం పరమాత్మ కాదని ఆయన వ్యాప్తిని తగ్గించి సంకుచితమైన పరమాత్మ అనే తమస్సులో పారేస్తుంది. ఆవరణ విక్షేపాత్మకమే గదా ప్రకృతి అంటే. కనుక ఈ రెండు ప్రమాదాలూ తప్పించుకోవాలంటే ప్రపంచాన్ని వదిలేసి పరమాత్మనూ కాదు. పరమాత్మను వదిలేసి ప్రపంచాన్నీ గాదు. దీనిలో దాన్నీ దానిలో దీన్ని చూస్తూ పోవాలి. అప్పుడు సామాన్య విశేషాలు రెండూ సామాన్య రూపంగానే మారిపోయి ఏకైకమైన అద్వైతాత్మ రూపంగా నీ అనుభవానికి వస్తుంది. అదే చెబుతున్నాడు బ్రహ్మ సంపద్యతే తదా. ఇలా జోడు గుఱ్ఱాల స్వారీ చేసే జ్ఞానే బ్రహ్మానుభవానికి నోచుకొంటాడు. బ్రహ్మమే హామీ ఇస్తున్నది గీత. అయిపోతాడని

  ఇప్పుడిలాటి శ్లోకమిదే గాదు మొదటిసారి మనం వినటం. ఇంతకు ముందు కూడా వచ్చిందిలాటి శ్లోకమే. సర్వభుతస్థ మాత్మానం సర్వభూతాని చాత్మని అనేదిలాటి శ్లోకమే. అక్కడా ఇదే భావం. ఆత్మలో అనాత్మనూ

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు