మంటున్నాడు మహర్షి. ఏకస్థ మని చెప్పటమందుకే. ఏకస్థ మను పశ్యతి. ఎవడైతే ఎప్పుడలా ఏకం చేసి దర్శించగలడో అని షరతు పెట్టాడు. అంటే ప్రపంచాన్ని పరమాత్మ దృష్టితో చూడాలని అర్థం.
అలా చూస్తే సరిపోతుందా. సరిపోదు. తత ఏవచ విస్తారం. మరలా ఈ చిత్ర విచిత్రంగా విస్తరించిన ఈ భూత భౌతిక ప్రపంచాన్నంతా తత ఏవచ. ఆ ఏకైకమైన తత్త్వం లోనుంచే ఆవిర్భవిస్తున్నట్టుగా కూడా చూడగలిగి ఉండాలి. లేకుంటే అది One way trafic పాక్షికమైన దృష్టే అవుతుంది. పాక్షికమైతే అది అద్వైతం కాదు. ద్వైతం. ప్రపంచాన్ని బ్రహ్మంగా చూడటం మంచిదే. కాని అంత మాత్రాన ప్రపంచం కనపడకుండా పోదు. ప్రారబ్ధం తీరేవరకూ శరీరముంటుంది. శరీరమున్నంత వరకూ బాహ్య ప్రపంచం కనిపిస్తూనే ఉంటుంది. దానితో లావాదేవీ మనకుండనే ఉంటుంది. కాబట్టి పిల్లి కళ్లు మూసుకొని పాలు త్రాగినట్టు ప్రపంచం లేదులే లేదులే అని భావిస్తే సుఖం లేదు. లేదనుకోటం కాదు. ఉన్నా ఇది ఆ ఏకైకమైన పరమాత్మ విస్తారమే విభూతే నని పరమాత్మ తత్త్వంతో ముడిపెట్టుకొని దాని కనన్యంగా దర్శిస్తూ పోవాలి. అంటే అప్పటి కనేకాన్ని ఏకంగా ఏకాన్ని అనేకంగా అనాత్మ నాత్మ స్వరూపంగా ఆత్మ స్వరూపాన్ని అనాత్మ రూపంగా రెండూ కలిపి పట్టుకోవాలి.
Page 104