#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

జ్ఞానాని కన్యం కాకపోయినా అన్యమైన ప్రపంచమొకటి ఏదో ఉందని మన భావన. ఇలా భావించటం మన ప్రకృతి అయితే దీని కనుగుణంగా పరమాత్మ చైతన్య మీ రూపంగా దర్శనమివ్వటం దాని ప్రకృతి.

  సప్తమాధ్యాయంలో ఈ ప్రకృతులు రెండింటినీ గూర్చిన ప్రస్తావన వచ్చింది ఇంతకు ముందే. సప్తమాధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం. దానికి వ్యాఖ్యానమే ఈ క్షేత్ర జ్ఞాధ్యాయం. ఆ మాటకు వస్తే అసలు భగవద్గీతలో నాలుగే ఉన్నా యధ్యాయాలు ప్రధానమైనవి. నాలుగూ ఒక దాని కొకటి ప్రత్యామ్నాయాలే మరలా. మొదటిది సాంఖ్య కర్మయోగాలు. రెండవది జ్ఞాన విజ్ఞానాలు. మూడవది రాజ విద్యా రాజ గుహ్యయోగాలు. నాలుగవది ఇప్పుడీ క్షేత్ర క్షేత్రజ్ఞాలు. నాలుగింటిలో ఒకే బాణీలో నడుస్తుంది విషయం. నాలుగూ రెండే రెండు విషయాలు వర్ణించి చెబుతాయి మనకు. ఏదో గాదది. జ్ఞానమూ జ్ఞేయమూ. జంట నామాలివి. జ్ఞాన జ్ఞేయాలన్నా ఇవే. జ్ఞానమూ కర్మా అన్నా ఇవే. క్షేత్రజ్ఞుడూ క్షేత్రమన్నా ఇవే. ఒకటి తెలుసుకొనేది. మరొకటి దానిచేత తెలియబడేది. The knower and the known. తెలుసుకొనేదే ఆత్మ అన్నారు తెలియబడేదే అనాత్మ అన్నారు అద్వైతులు.

  అయితే రెండు చెబుతున్నారు గదా అద్వైతమెలా అయిందని అడగవచ్చు మీరు. రెండని మాట సామెతే గాని రెండూ కలిసి వాస్తవంలో ఒకటే తత్త్వం. రెండూ వాస్తవమైతే వేరు గాని ఒకటి వస్తువూ మరొకటి దాని ఆభాస అయితే వేరుగావు. ఒకటే అవుతాయి. ఇంతెందుకు. సముద్రం మీద ఒక తరంగమూ ప్రయాణిస్తుంటుంది. ఒక పడవా దాని మీద