#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

విశ్వమంతానని గమనిస్తూ ఉండవచ్చు గదా. అది పరమాత్మ. అలా గమనించే సాక్షి జ్ఞానం లేకపోతే దీనికిగాని దానికి గాని ప్రమాణ Proof or evidence మేమిటి. ప్రమాణం లేకుంటే ప్రమేయానికి సిద్ధి ఎక్కడిది. అది నాకు కండ్లు లేవుగాని రూపం మాత్రం చక్కగా కనిపిస్తున్నదని చెప్పటం లాంటి అవివేక ప్రసంగ మంటారు భగవత్పాదులు.

  కాగా ఇప్పుడు మనలో ఉన్న ఈ ప్రత్యగాత్మ గాని ప్రపంచ శరీర మంతా వ్యాపించిన ఆ పరమాత్మగాని కేవలం నేనున్నానే స్ఫురణే గాని మరేదీ కాదు గదా. అదుగో అలాటి స్ఫురణ మాత్రమే అయినప్పుడు రెండూ ఒకటంటావా. రెండంటావా. రెండనటానికి విశేషమేముంది అందులో. కాబట్టి రెండూ ఒకటే వాస్తవంలో కాని వాస్తవంలో ఒకటి అయినా ఈ శరీరంలో ఉన్న నేను అలా భావించటం లేదు. అవి నేను ఇలా ఉన్నానలా ఉన్నాని తన్ను తాను వికల్పించి చూచుకొంటున్నది. అలాటి చూపుతోనే పరమాత్మను కూడా చూస్తున్నది. దానితో తాను జీవుడయి అది ఈశ్వరుడయి రెంటికీ మధ్య అఖాతం పెరిగిపోయింది. అదే ఈ సంసార బంధం జీవుడికి. మరలా వీడు దీనిలో నుంచి బయట పడాలంటే తన వికల్ప దృష్టిని లేదా విశేష దృష్టిని నిర్విశేష లేదా సామాన్య దృష్టిగా మార్చుకోవలసి ఉంది. యద్భావ స్త ద్భవతి అన్నారు. విశేషదృష్టికి సామాన్యమే విశేషంగా భాసిస్తే సామాన్య దృష్టికి మరలా ఈ విశేషాలన్నీ సామాన్యంగానే దర్శనమిస్తాయి. అప్పుడిక జీవేశ్వర భేదం లేదు. విశేష

Page 99

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు