#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

దృష్టే గదా జీవుడంటే. సామాన్య దృష్టే ఈశ్వరుడు. వీడికి సామాన్య దృష్టి అలవడిందంటే వీడే ఈశ్వరుడు. ఇక వీడంతకు ముందూహించిన ఈశ్వరుడు వేరే ఎక్కడా లేడు. అంతేకాదు. వీడికి భిన్నంగా పిండ బ్రహ్మాండ శరీరాలు కూడా ఎగిరిపోయాయి. విశేష దృష్టి ఉన్నంత వరకే అని విశేష దృశ్యాలుగా కనిపించాయి. అది ఎప్పుడు సామాన్యమయిందో జీవ విశేషంతో పాటు జగద్విశేషం గూడా సామాన్యంలోనే కలిసిపోయింది.

  ఈ అఖండమైన పరిపూర్ణమైన తత్త్వానికే పరమాత్మ అనీ బ్రహ్మమనీ పేరు. తే బ్రహ్మ తద్విదుః కృత్స్నమ్, కృత్స్నమంటే సమస్తం. ఏమిటా సమస్తం. జీవుడూ జగత్తూ ఈశ్వరుడూ ఈ మూడూ మూడు గాక సమస్తంగా ఏకైకమైన బ్రహ్మంగా దర్శనమిస్తాయి. ఎవరైతే అలాటి బ్రహ్మతత్త్వాన్ని విదుః దర్శిస్తారో వారు బ్రహ్మాన్నే గాదు. అధ్యాత్మం కర్మ చాఖిలం విదుః అధ్యాత్మ మంటే ప్రత్యగాత్మ విషయమని అర్ధం చెప్పారు గురువుగారు. పరమాత్మను దర్శించావంటే ప్రత్యగాత్మ కూడా అందులోనే కలిసి వచ్చింది. కర్మచా ఖిలం. దానితోపాటు కర్మ కూడా అందులోనే సమసిపోతుంది. చలనమేగా కర్మ. అచలమైన బ్రహ్మమే తన స్వరూపమని జీవుడు భావించి నప్పుడిక చలనాత్మకమైన కర్మ కర్ధ మేముంది అదీ బ్రహ్మమే.

సాధిభూతాధి దైవం మాం సాధియజ్ఞంచ యే విదుః
ప్రయాణ కాలేపి చమాం తే విదు ర్యుక్త చేతసః - 30

Page 100

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు