విశేషం. అని ఇలా సచ్చిద్రూపానికి చెందిన ఆలోచన ఎప్పుడూ ఏమరకుండా మనసులో నిలుపుకోటమే ఏకైకమైన లక్ష్యం జీవితానికి. అది సడలి పోతుంటే మరలా విడవకుండా ముడి పెట్టుకొంటూ పోవటమే వ్రతం. అదే సాధన. అదే ప్రయత్నం. దానివల్లనే సత్త్వం శుద్ధి అయి ఆత్మజ్ఞాన ముదయిస్తుంది. అనాత్మ భావమనే తమస్సును పారదోలి అఖండమైన స్వరూపాన్ని నీకు బయట పెడుతుంది.
జరా మరణ మోక్షాయ - మామాశ్రిత్యయతంతి యే
తే బ్రహ్మ త ద్విదుః కృత్స్న మధ్యాత్మం కర్మ చాఖిలమ్ - 29
ఇంతకూ మానవుడికున్న ఏకైక సమస్య జరామరణాలే. జరామరణ మోక్షాయ. అందుకోసమే మోక్షం కోరుతున్నాడు మానవుడు. జరామరణ బంధం నుంచి బయట పడటమే మోక్షం. అలాటి మహాఫలం నీకు లభించాలంటే దానికి నీవు చేయవలసిన ప్రయత్న మొక్కటే. అది దీన్నీ దాన్నీ దూరం చేసుకొందా మని ప్రతిలోమంగా చేసేది గాదు. అనులోమంగా. ఏమిటది. మామాశ్రిత్య యతంతియే. నన్నే ఆశ్రయించే యత్నం చేయమని సలహా ఇస్తున్నాడు భగవానుడు. నన్నంటే ఏమిటర్ధం. నేననే భావాన్ని, ఎక్కడ ఉందది. విశ్వమంతా వ్యాపించి ఉంది. నీ శరీరాన్నీ వ్యాపించి ఉంది. ఈ శరీరమూ - ఇంద్రియాలూ ప్రాణమూ మనోభావాలూ వీటన్నిటినీ నేను చూస్తున్నాను ఇవన్నీ నావే నాకు సంబంధించినవే నని చూస్తున్నావా లేదా నీవు. ఆనేననుకొనే నీవే ప్రత్యగాత్మ. పోతే ఇలాటి నేనే చాలా పెద్ద మోతాదులో ఈ విశ్వమనే శరీరాన్ని కూడా నాదే ఈ
Page 98