#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

ఏర్పడింది. బుద్ధి జీవి మానవుడు. బుద్ధి ఒక్కటే సాధనం వీడికి. అందులో రజస్తమస్సులు చేరిపోయి సత్త్వాన్ని అణగ దొక్కుతుంటాయి. సత్త్వాన్ని మనం వృద్ధి చేసుకో గలిగితే అది వాటికి జవాబు చెబుతుంది. సత్వా త్పంజాయతే జ్ఞాన మన్నది గీత. సత్త్వం వల్లనే ఏ జ్ఞానమైనా ఉదయిస్తుంది. అది ఎలా వృద్ధి చెందాలా సత్త్వగుణం పుణ్యకర్మణాం. కర్మయోగ భక్తి యోగాదు లభ్యసిస్తూ పోవటమే దాని కుపాయం. అది క్రమంగా రజస్తమస్సులను పారదోలి సత్త్వాన్ని శుద్ధి చేస్తాయి. చేస్తే తే ద్వంద్వమోహ నిర్ముక్తాః - సత్త్వం బాగా ప్రవర్ధ మానమై ద్వంద్వ మోహమనే చీకటి పొరలు విరిసి పోయే లాగా జ్ఞాన ప్రదీపాన్ని వెలిగిస్తుంది.

  అయితే చెప్పినంత సులభం కాదది. చెప్పటం వేరు. చెప్పింది ఆచరించటం వేరు. అందుకే దృఢవ్రతాః - దృఢమైన వ్రతముండాలి మానవుడికని ఖండితం చేసి చెబుతున్నది గీత. వ్రతమంటే దీక్ష. పట్టుదల. committmentపట్టు సడలని విక్రమార్కుడిలాగా విజృభించాలి సాధకుడు. ఆవరణ విక్షేపాలకు జవాబు చెప్పగల కర్మయోగాన్ని భక్తియోగాన్ని ఏమర కుండా అభ్యసిస్తూపోవాలి. అది కూడా యాంత్రికంగా చేస్తే సుఖం లేదు. లక్ష్యం మీద దృష్టి పెట్టుకొని చేయాలేదైనా. ఏమిటా లక్ష్యం. భజంతే మాం. నేనే నీకు లక్ష్యం. నన్నే పట్టుకో మంటున్నాడు భగవానుడు. ఏవమేవ పరమార్ధ తత్త్వం నాన్యధా అని వ్రాస్తున్నారు స్వామివారు. పరమార్ధమిదే మరేదీ గాదు. అస్తి భాతి ఇవి రెండే సర్వత్ర సర్వ పదార్ధాలలో వ్యాపించి ఉన్నాయి. ఏదైనా ఉండటం స్ఫురించటం. ఇంతేగాని మరేముంది

Page 97

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు