#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

ఆత్మభావేన భజంతే అని వివరిస్తున్నారు భాష్యకారులు. అంచేతనే పుట్టుకతోనే వెంటబడ్డ ఈ ద్వంద్వాత్మకమైన సమ్మోహంతో సమ్మూఢులై పోయి మానవులు తమ ఆత్మ స్వరూపంగానే ఉన్న నన్ను ఏ మాత్రమూ గుర్తించ లేక నామాయా జాలంలో పడిపోయి సతమత మవుతున్నారని పరమాత్మ వాపోతున్నాడంటున్నారు గురువుగారు. కాబట్టి ద్వంద్వమోహమే Cosmic Illusion నరుడు నారాయణుణ్ణి దర్శించకుండా అడ్డుపడుతున్న భయంకర పిశాచి.

యేషాం త్వంత గతం పాపం జనానాం పుణ్య కర్మణాం తే ద్వం ద్వమోహ నిర్ముక్తా - భజంతే మాం దృఢ వ్రతాః - 28

  అయితే ఇంతేనా మనగతి. ఈ ద్వంద్వమోహం నుంచి బయటపడే మార్గమే లేదా మానవుడికి. సమస్యకు నిష్కృతే remedy లేకపోతే ఇంత శాస్త్రోపదేశం దేనికి. అనావశ్యకమే గదా అని అడిగితే దానికిప్పుడు జవాబిస్తున్నది గీత. యేషాం త్వంత గతం పాపం. ఎవడికి పాపమనేది పిసరు మిగలకుండా అంతమయి పోతుందో వాడికుంది తరణోపాయం. అవిద్యాకామ కర్మలు మూడే పాపాలు మన పాలిటికి. అందులో అవిద్యే మిగతా రెండింటికీ మూలకారణం. ఆత్మ అంటే ఫలానా అని గుర్తించ లేకపోవటమే అవిద్య. గుర్తిస్తే ఆత్మానాత్మలు రెండూ ఆత్మగానే దర్శనమిస్తాయి. అదే విద్య Realisation. అది ప్రకాశం లాంటిది. అది ఉదయిస్తే చాలు అవిద్య అనే అంధకారం పటాపంచె లవుతుంది. ఎలా ఉదయించా లది. జనానాం పుణ్య కర్మణాం. అందుకే గదా మానవ జన్మ

Page 96

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు