అయిన జ్ఞాన ముదయించకుండా చేసే మోహమనే ఆవరణాన్ని తెచ్చి వాళ్ల మీద పడేస్తాయి. నహి ఇచ్చా ద్వేష దోష వశీకృత చిత్తస్య యధా భూతార్ధ జ్ఞాన ముత్పద్యతే బహిరపి - కిము వక్తవ్యం తాభ్యా మా విష్ణ బుద్ధేః సమ్మూఢ స్య ప్రత్యగాత్మని బహుప్రతి బంధే జ్ఞానం నోత్పద్యత ఇతి. రాగద్వేషాలనే దోషానికి వశమై పోయిన మనస్సుకు బాహ్య ప్రపంచ విషయాలలోనే సరియైన జ్ఞాన మేర్పడటం లేదు. అలాంటప్పుడు వాటి గుప్పిట్లో చిక్కి చిక్కి పోయిన మానవుడి బుద్ధికి అనేక ప్రతిబంధకాలతో కూడిన ప్రత్యగాత్మ జ్ఞాన మేర్పడటం లేదంటే ఆశ్చర్య మేముంది. కనుకనే ఎంత శ్రవణం చేసినా ఎంత మధన పడుతున్నా మానవుడందు కోలేక పోతున్నాడు. లంగరు దీయకుండా ఓడ నడపాలంటే నడపగలవా.
అసలీ లంగరెలా ఏర్పడిందీ ఓడకు. మనసనే నావకీ ద్వంద్వ మోహమనే లంగరెవరు దించారు ఎప్పుడు దించారని మరలా ఒక ప్రశ్న. ఎవరు దించారో ఏమో. సర్వభూతాని సమ్మోహం సర్గేయాంతి పరంతప. అసలు మానవుడు పుట్టీ పుట్టటంతోనే ఏర్పాడుతున్నదీ సమ్మోహం Illusion. మోహ వశాన్యేవ సర్వభూతాని జాయమానాని జాయంతే. పుడుతూనే అజ్ఞానంతో పుట్టాడట ప్రతివాడూ. పుట్టిన తరువాత అజ్ఞానం గాదు. పుట్టుకతోనే అజ్ఞానం. అజ్ఞానాన్ని వెంటబెట్టుకొనే వచ్చాము మన మీ లోకంలోకి. అజ్ఞానంతోనే బ్రతుకుతున్నాము. అజ్ఞానంతోనే కన్ను మూస్తున్నాము. యత ఏవం అతః తేన ద్వంద్వ మోహేన ప్రతిబద్ధ జ్ఞానాని సర్వభూతాని సమ్మోహితాని మామాత్మ భూతం న జానంతి
Page 95