#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

  మొత్తంమీద జీవు డీశ్వరుడికి వారసుడే అయినా ఈశ్వరుడే జీవరూపం ధరించి శరీరంలో వచ్చి కూచున్నా విశేష జ్ఞానం వదలకుండా పట్టుకొన్న నేరానికి సామాన్య జ్ఞాన స్వరూపుడైన ఈశ్వరుడే నేనని తన ఈశ్వర స్వరూపాన్ని గుర్తించలేక పోతున్నాడని తేలింది. పోతే ఈశ్వరుడయి కూడా ఈశ్వరుడనే అని ఎందుకు గుర్తించ లేకపోతున్నాడని ప్రశ్న వస్తే దానికి సమాధాన మిస్తున్నాడు మహర్షి. ఇచ్ఛా ద్వేష సముత్తైన ద్వంద్వమోహేన. ఇచ్ఛా ద్వేషాలంటే రాగద్వేషాలు. ఇవే ద్వంద్వా లన్నిటికీ మూలభూతమైన ద్వంద్వాలు. రాగద్వేషాల నేవి లేకపోతే మరే ద్వంద్వాలూ ఏర్పడవు మానవుడి బుద్ధిలో. అదే ఒక గొప్ప మోహం. అజ్ఞానం. భగవత్తత్త్వ జ్ఞానానికి ప్రతిబంధకం. భగవత్పాదులు వ్రాస్తున్నారు చూడండి అద్భుతంగా. ఇచ్ఛా ద్వేషౌ శీతోష్ణ వ త్పరస్పర విరుద్ధె సుఖదుఃఖ తద్ధేతు విషయౌ యధా కాలం సర్వభూతై స్సంబధ్యమానౌ ద్వంద్వ శబ్దేనాభి ధీయేతే. రాగద్వేషాలే అన్నిటికీ మూలం. అవే సుఖాదుఃఖాది ద్వంద్వాలన్నిటినీ కల్పిస్తున్నాయి. ఆయా సమయాల్లో ప్రతి ఒక్క మానవుణ్ణి పట్టి చూస్తూ ఉన్న ద్వంద్వాలన్నీ అవే. తత్ర యదా ఇచ్ఛా ద్వేషౌ సుఖదుఃఖ త ద్ధేతు సంప్రాప్త్యా లబ్ధాత్మకౌ భవతః తదా తౌ సర్వభూతానాం ప్రజ్ఞాయాః స్వవశాపాదన ద్వారేణ పరమార్ధ తత్త్వ విషయ జ్ఞానోత్పత్తి ప్రతిబంధకారణం మోహం జనయతః ఎప్పుడైతే ఈ రాగద్వేషాలు సుఖదుఃఖాది రూపంగా బయట పడతాయో అప్పుడవి సకల ప్రాణులకూ సహజంగా ఉన్న జ్ఞానాన్ని తమ కధీనం చేసుకొని పరమార్ధ సంబంధి

Page 94

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు