#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

తోశాయి. ఈ ముందుకు వచ్చిన వృత్తి జ్ఞానమే చిదాభాసుడైన జీవుడు. వీడికున్న ఆ పరిచ్ఛిన్న జ్ఞానమే మనస్సు. అది విశేష జ్ఞానం గనుక విశేషమైన జ్ఞేయ ప్రపంచాన్నే చూస్తుంటుంది. రెండు విశేషాలూ వియ్య మందుకొని తమకు ఆధారభూతమైన సామాన్య జ్ఞానాన్నే మరచిపోయాయి. ఆ విశేషం సత్తను మరిస్తే ఈ విశేషం చిత్తును మరచింది. తరంగం తరంగం లావాదేవీ పెట్టుకొని సముద్రాన్ని మరచిపోతే ఎలా ఉంటుంది. తమలో ఉన్నదా సముద్ర జలమే అయినా అది ఏ కొంచెమో. తమ ఉపాధి వరకే పరిమితమై కనిపిస్తుంది. దానితో చూడబోతే విశాలంగా వ్యాపించిన సముద్రం కనిపిస్తుందా. అలాగే మానవుడి జ్ఞానం ఈశ్వరీయమైన జ్ఞానమే అయినా ఇందులో వచ్చి కూచున్నదదే అయినా ఈ చిత్త వృత్తులనే Idea ఉపాధుల మేరకే తగ్గిపోయింది వీడి దృష్టి. అలాంటి సంకుచితమైన దృష్టి కనంతంగా వ్యాపించిన ఈశ్వర తత్త్వమెలా గోచరిస్తుంది. దానికి బదులా ఈశ్వర చైతన్యం తన బుద్ధిలో ఎంత ప్రతిఫలించిందో అంతే గోచర మవుతుంది. అదే ఈ నామరూపాత్మక మైన ప్రపంచం. పోతే మిగతా చైతన్య భాగం త్రిపాదస్యామృతం దివి అన్నట్టు ఎక్కడో తన కతీతంగా ఉందని ఊహిస్తూ బ్రతుకుతుంటాడీ మానవుడు. ఇదీ ఇందులో మనమర్ధం చేసుకోవలసిన శాస్త్ర రహస్యం.

ఇచ్ఛాద్వేష సముత్తైన- ద్వంద్వ మోహేన భారత
సర్వభూతాని సమ్మోహం సర్గేయాంతి పరంతప - 27

Page 93

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు