#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

భవిష్యాణి చ భూతాని. ఇక మీదట జరగబోయే విషయాలు కూడా తెలుసునంటా డీశ్వరుడు. మొత్తం మీద భూత భవిష్య ద్వర్తమానా లేవీ అడ్డు తగలవు ఈశ్వరీయమైన జ్ఞానానికి. తిరుగుతూ ఉన్న భూమండలానికి సూర్యప్రకాశం బయటపడుతూ మరుగుపడుతూ ఉన్నప్పటికీ దానికేదీ మరుగుపడనట్టే ఈశ్వర చైతన్యానికి దేశకాల వస్తువు లేవీ అడ్డురావు. అవధులు లేని జ్ఞానమది. దేశకాలాదులు మాయాగుణాలే గదా. మరి మాయే దాని కధీన మయినప్పుడు దాని గుణాలు దానినెలా నిరోధిస్తాయి. అనిరుద్ధమైన ప్రకాశమది. అప్పుడే అది నిరుపాధిక మనంతం.

  కాగా అలా నిరుపాధికం గాక సోపాధికమైనది మనబోటి మానవుల బుద్ధే. దేహేంద్రియ ప్రాణ బుద్దులు గుణాత్మకాలే గదా. అంచేత పిండ శరీరానికే నియంత్రిత మీ బుద్ధి. సర్వతో ముఖంగా వ్యాపించిన భగవత్తత్త్వాన్ని సమగ్రంగా ఆకళించుకోలేదు. అందుకే మాంతు వేద నకశ్చన. నేను అన్నింటినీ గమనిస్తూనే ఉంటాను గాని ఏ మానవుడూ నన్ను చూడలేక పోతున్నాడని మన తరఫున తపిస్తున్నాడు పరమాత్మ. మరి ఈశ్వరుడే జీవుడు. జీవుడే ఈశ్వరు డన్నారు గదా. ఆయన కున్న దృక్శక్తి Comprehensive vision మనకు లేకపోవట మేమిటి. నిజమే. మనకూ ఉందా శక్తి. లేకపోలేదు. ప్రత్యగాత్మ రూపంగా మరుగు పడి ఉంది. ప్రకటం కావటం లేదు. ఏమి కారణం. నామరూపాది విశేషాలను చూచి చూచి విశేషాత్మకంగా మారింది. వృత్తిజ్ఞానమే తప్ప సాక్షిజ్ఞానానికి నోచుకోలేక పోతున్నాము. వృత్తులు ముందుకు వచ్చి సాక్షిని వెనక్కు

Page 92

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు