#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

దానిమీదనే ఉన్న మండలం నీకు దృగ్గోచర మవుతుందా. కాని నీవు చూచినా చూడకున్నా వాడక్కడ ఉండనే ఉన్నాడు. ఆ సూర్యు డక్కడ ప్రకాశిస్తూనే ఉన్నాడు. కేవలం వాడి సృష్టే నీకు కనపడుతున్నది. వాడు గాదు. సృష్టి సృష్టి కర్త కడ్డు రావటం లేదు. సృష్టి నీ దృష్టికే అడ్డం వస్తున్నది. నామరూపాలే సృష్టి. అవి గుణాత్మకమైన మాయా ప్రభావం. అదే నీ మనోనేత్రాని కవరోధమయి అక్కడే ఉన్న పరమాత్మ చైతన్య ప్రకాశాన్ని నీవు చూడకుండా చేస్తున్నది. దానికి మారుగా భార్యాపుత్ర గృహారామ నదీ పర్వతాది రూపాలనే నిరంతరమూ నీకు చూపి దీనితో నిన్ను జోకొట్టి నిద్ర పుచ్చుతున్నది. అందుకే ఎప్పటికప్పుడు వాటితో పాటు నీ జీవితం కూడా వ్యయమయి పోతున్నదే గాని పరమాత్మలాగా అవ్యయం కాలేక పోతున్నది.

వేదాహం సమతీతాని - వర్తమానాని చార్జున
భవిష్యాణిచ భూతాని మాంతు వేద న కశ్చన - 26


  అయితే నా మాయా జాలంలో పక్షిలాగా పడిపోయి నీ బుద్ధి పనిచేయక పోవచ్చు. కాని నేను మాత్రం వస్తుసిద్ధంగా నాపాటికి నేను దేదీప్యమానంగా ప్రకాశిస్తూనే ఉన్నాను. అంతేగాదు. అది సూర్యచంద్రాగ్నుల లాంటి జడ ప్రకాశం కాదు. చైతన్య ప్రకాశం. నేనున్నట్టు నాకు తెలుసు. నన్నూ నా సృష్టినీ రెండింటినీ సాక్షిగా చూస్తున్నాననీ నాకు తెలుసు. అంచేతనే వేదాహం సమతీతాని. జరిగిపోయిన విషయాలూ తెలుసు నాకు. వర్తమానానిచ. ఇప్పుడు జరుగుతున్నవీ తెలుసు. అంతేకాదు

Page 91

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు