#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

మేమిటి. అర్ధం లేని మాట. గారడీ వాడి విద్య గారడీ వాడికే అవరోధ మవుతుందా. అందుకే అంటున్నారు గురువుగారు. నాసౌ యోగమాయా మదీయా సతీ మమ ఈశ్వర స్య మాయావినో జ్ఞానం ప్రతిబధ్నాతి అని. నాదే అయిన మాయ నా దృష్టి నెలా అడ్డగిస్తుందని సంజాయిషీ ఇస్తారాయన.

  అయితే మరెవరి కిది ప్రతిబంధకం. సూర్యుడికి మేఘం కానట్టే ఐంద్రజాలికుడి కింద్రజాల విద్య కానట్టే ఈశ్వరుడికి కాదిది ప్రతిబంధకం. క్రింద నిలుచొని పైకి చూచే మానవుడి దృష్టికి మేఘం ప్రతిబంధకం. గుడ్లప్పగించి కను కట్టు వదలకుండా చూచే ప్రేక్షకుడికి గారడీ ప్రతి బంధకం. అలాగే పరమాత్మ మాయా విలాసమైన ఈ నామరూపాత్మకమైన ప్రపంచమే ఒక ఇంద్రజాల ప్రదర్శనలాగా అడ్డగిస్తున్నది మానవుడి బుద్ధిని. అందుకే వీడి దృష్టి త్రిగుణాల ప్రభావం పనిచేసి మూఢమయి పోయింది. అలాటి మూఢబుద్ధి గనుకనే నాభి జానాతి హమేభ్యః పరం అందుకోలేక పోతున్నాడు దానికి పరంగా అతీతంగా ఉన్న భగవత్తత్త్వాన్ని. అవ్యయమది. మార్పులేనిది. నిలకడగా ఉన్న తత్త్వం. మరి వీడి బుద్ధి. త్రిగుణాలు అనుక్షణమూ తిప్పుతుంటే తిరుగుతూ పోతుంటుంది. ఒక్కక్షణం నిలకడగా ఉండలేదు. ఇలాటి అస్థిరమైన బుద్ధితో సుస్థిరమైన ఆ తత్త్వాన్ని ఎలా పట్టుకోగలడు. అసాధ్యం. గారడీ చూస్తూనే గారడీ వాడెక్కడున్నాడో నీవు గుర్తించ గలవా. మేఘమావరించి ఉన్నంతవరకూ

Page 90

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు