#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము భగవద్గీత







7. జ్ఞాన విజ్ఞాన యోగము

అవతారిక

భగవద్గీతలో ఇప్పటికి ప్రథమ షట్కం సమాప్తమయింది. పోతే ప్రస్తుతం మనం ద్వితీయ షట్కంలో ప్రవేశిస్తున్నాము. 7 నుంచి 12 వరకూ ఆ రధ్యాయాల గ్రంథమిది. అందులో ఏడవ అధ్యాయం పేరు జ్ఞాన విజ్ఞాన యోగం. దీనితో ప్రారంభ మవుతున్నదీ షట్కం. మొదటి షట్కం త్వం పదార్ధ శోధన చేసి జీవుణ్ణి ఈశ్వర సాయుజ్యానికి సంసిద్ధుణ్ణి గావించిందని పేర్కొన్నాము. పరిశుద్ధుడూ సిద్ధుడూ అయిన జీవుడిప్పుడా ఈశ్వర తత్త్వాన్ని అనుభవానికి తెచ్చుకోవలసి ఉన్నది. అదే తత్పదార్థం తత్త్వమసి మహావాక్యంలో. జీవుడు త్వం పదార్ధమైతే ఈశ్వరుడు తత్పదార్ధం. అయితే త్వం పదార్ధమైన జీవుణ్ణి ఎలా శోధన చేశామో అలాగే ఇప్పుడీ

Page 9

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు