జ్ఞాన విజ్ఞాన యోగము
భగవద్గీత
ఈశ్వరుడనే తత్పదార్ధాన్ని కూడా శోధన చేయవలసి ఉంటుందని పేర్కొంటారు వేదాంతులు.
జీవుడంటే కర్తృత్వ భోక్తృత్వాలనే మాలిన్యముండటం మూలాన వీణ్ణి శోధన చేశామంటే అర్థముంది గాని ఈశ్వరుడు సహజంగానే పరిశుద్ధుడు గదా. ఇక మరలా శోధన చేయవలసిన అవసర మేముందని ప్రశ్న. ఉంది ఈశ్వరుడికి కూడా అంతో ఇంతో మాలిన్య మామాటకు వస్తే. అయితే ఆయన కది సహజం కాకపోవచ్చు. సహజంగా లేకపోయినా జీవులమైన మనమే ఆరోపించి కూచున్నా మాయనకు. అవే నామరూపాలు. నామరూపాత్మకంగానే భావిస్తుంటా మీశ్వరుణ్ణి కూడా మనం. అంతేగాక సృష్టి స్థితి లయాది కర్తృత్వం కూడా తగిలించాము. నిగ్రహాను గ్రహాది క్రియలు కూడా ఆరోపించాము. మన మిచ్చింది పుచ్చుకొనే భోక్తృత్వం కూడా ఆరోపించా మాయనకు. ఈవిధంగా మనకెన్ని అవలక్షణా లున్నాయో పెద్ద స్థాయిలో ఆయనకు కూడా అవి అప్పజెబుతున్నాము. ఏవం విధ గుణ విశిష్టుడే ఇప్పు డీశ్వరుడంటే మనకు.
అవన్నీ ఇప్పుడు శుద్ధి చేయకపోతే ఎలాగ. మనం శుద్ధి అయి ఆయన శుద్ధి కాకుంటే ఇరువురికీ ఏకత్వమెలా సిద్ధిస్తుంది. గుణాలు దాని కడ్డు తగులుతాయి గదా. అయితే అవి ఆ ఈశ్వరుడికి మనమే ఆరోపించాము గనుక శుద్ధి చేయవలసిన డ్యూటీ కూడా మనదే. మన జీవ భావమెలా పోగొట్టుకొని పరిశుద్ధులం కావాలో అలాగే ఈశ్వరుడి కారోపించిన ఈశ్వర భావం కూడా పోగొట్టి పరిశుద్ధంగా మార్చుకొని
Page 10