#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

చూడాలి మనమే ఆ ఈశ్వరుణ్ణి. జీవ భావం శుద్ధి అయితే మనం జీవులం కాము. ప్రత్యగాత్మ స్వరూపులం. అలాగే ఈశ్వరభావం అక్కడా శుద్ధి అయితే ఆయన ఈశ్వరుడు కాడు. పరమాత్మ స్వరూపుడు. అప్పుడిక ప్రత్యక్పరమ అనే మాటలు కూడా చెప్పుకోట మనవసరం. రెండూ కలిసి అఖండమైన ఆత్మగానే దర్శనమిస్తాయి. ఇదే అసలైన జీవేశ్వరైక్యం. అనేకంగా చూస్తే జీవుడూ ఈశ్వరుడే గాని ఏకంగా భావిస్తే జీవుడూ లేడు. ఈశ్వరుడూ లేడు. రెండింటి బదులూ ఉన్నదాత్మే. మరేదీ గాదు.

  ఇలాంటి ఏకాత్మ భావ మందుకోటానికి మొదటి షట్కంలో ఇంతకు ముందు జీవుణ్ణి ఎలా అంచెలవారిగా శుద్ధి చేస్తూ వచ్చిందో - అలాగే ప్రస్తుత మీ ద్వితీయ షట్కంలో ఈశ్వరుణ్ణి కూడా భూమికా క్రమంలో శుద్ధి చేసి చివరకు పరమాత్మ తత్త్వాన్ని మనకు బయటపెట్ట బోతున్నది భగవద్గీత. దానికి మొదటి భూమిక ప్రస్తుత మీ జ్ఞాన విజ్ఞాన యోగం.

మయ్యాసక్త మనాః పార్థ - యోగం యుంజ న్మదాశ్రయః
అసంశయం సమగ్రం మాం యధా జ్ఞాస్యసి తచ్ఛృణు -1


  మద్గతే నాంతరాత్మనా అని ఇంతకుముందు ఆరవ అధ్యాయంలో పేర్కొన్నాడు పరమాత్మ. రుద్రాదిత్యాది దేవతలను గాదు. వారందరికీ విలక్షణమైన న నా తత్త్వాన్ని పట్టుకొన్నవాడే యోగు లందరిలో ఉత్తముడని గదా ప్రశంసించాడు. ఎవడా నేను ఏమిటా నేననే తత్త్వమని అడిగితే దాన్ని వివరిస్తున్నా డిప్పుడు. మయ్యాసక్త మనాః నా మీదనే మనసు లగ్నం చేసి మదాశ్రయః - నన్నే ఆలంబనంగా చేసుకొని యోగం యుంజన్ -

Page 11

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు