ఉపోద్ఘాతము
భగవద్గీత
ఒక నవలో కధానికో చదువుతున్న అనుభూతి కలిగి తీరాలి మీకు. మీ మనసులో ఎంతో కాలం నుంచీ పేరుకొని ఉన్న సందేహా లన్నిటికీ ఎక్కడికక్కడ సమాధానాలు వాటి పాటి కవే వస్తున్నట్టు మీకు స్ఫురించాలి. అంత వరకూ నేను హామీ ఇవ్వగలను. అంతేకాదు. భగవద్గీత ఎవరికీ కొత్తగాదు. కొన్ని శ్లోకాలైనా నోటికి వచ్చి ఉంటాయి. అందులో ముఖ్యమైన శ్లోకాలకీ వ్యాఖ్యాత ఎలా అర్థం చెప్పాడో చూడాలనే కుతూహల ముందా మీకు. అలాగైనా సరే. చదివి చూడండి. మీకే తెలుస్తుంది నేను వాటి నెలా వివరించానో. అది మీకు కొత్తగా చక్కగా కనిపించిందో మీకే ఆసక్తి పెరుగుతూ పోయి మిగతా గ్రంథమంతా మీ పాటికి మీరే దీక్షగా చదవగలుగుతారు. అపేక్షితమైన అధ్యాత్మ జ్ఞాన ఫలాన్ని తనివిదీరా ఆసాద్వించ గలుగుతారు.
ఇతి